మహబూబ్ నగర్ పర్యటనలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల పై మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ చూస్తూ ఊరుకోడని.. లంకలో పుట్టినోళ్లు అందరు రాక్షసులేనని ఫైర్ అయ్యారు. ఆంధ్రోళ్లు ఎన్నడూ తెలంగాణ మేలు కోరుకోరని.. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణకు ఎవరూ అన్యాయం చేసినా.. ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
read also : నిర్మాత సురేష్ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు
ఇక అంతకు ముందు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సిఎం కేసిఆర్ ఆలోచనలకు ప్రతి రూపం.. డబుల్ బెడ్ రూం ఇండ్లు అని పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను అడ్డుకుం టామని..సీఎం కేసీఆర్ మంచి వారికీ మంచి వాడు… చెడు చేస్తే.. అంతు చూస్తడని ఏపీకి వార్నింగ్ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోనే ఇండ్లు కట్టి ఉంటే… ఇపుడు ఇలా ఇండ్లు కట్టే అవసరం ఉండేదా..? వాళ్ళు ఒక రూమ్ కట్టి… ఇదే ఇల్లు అని చెప్పారని ఫైర్ అయ్యారు.