నిర్మాత సురేష్‌ బాబును బురిడీ కొట్టించిన కేటుగాడు

ఈ మధ్య ఆన్‌ లైన్‌ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. కొందరు మోసగాళ్లు… బడా నాయకులను, ప్రముఖులను టార్గెట్‌ చేసి మరీ.. డబ్బులు కొట్టేస్తున్నారు. అయితే.. తాజాగా కరోనా వ్యాక్సిన్లను అడ్డుపెట్టుకుని ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిర్మాత సురేష్ బాబును వ్యాక్సిన్ పేరుతో ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సీన్ లు ఉన్నాయని లక్ష రూపాయలు కొట్టేశాడు ఆ కేటుగాడు. అసలు వివరాల్లోకి వెళితే.. ఓ కేటుగాడు తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్‌ బాబు ఆఫీస్‌కు ఫోన్ చేశాడు.

read also : తమిళనాడులో బయటపడ్డ పురాతన వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం

దీంతో ఆ కేటుగాడు చెప్పిన బూటకపు మాటలు నమ్మి లక్ష రూపాయలు ట్రాన్సఫర్‌ చేశాడు సురేష్ బాబు మేనేజర్. అయితే.. డబ్బులు వేశాక.. ఆ కేటుగాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అందరికీ అనుమానం వచ్చింది. దీంతో ఆ కేటుగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. కాగా.. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-