Ponguleti: మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతో పనిచేస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti: మాటలు కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి మంత్రివర్గ సమావేశంలో ఆరు హామీలకు ఆమోదం తెలిపిందన్నారు. ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఖమ్మం రూరల్ మండలం మంగళదూడెంలో జరిగిన ప్రజాపాలన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు 16 గంటల పాటు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వెల్లడించారు.
Read also: Kishan Reddy: సీఎం మీకు చిత్త శుద్ది ఉందా? సీబీఐ విచారణకు లేఖ రాస్తారా లేదా…
Also Read
మరోవైపు.. ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి స్టేజీ వద్ద రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సహాయం కోసం ఎదురుచూస్తూ రోడ్డుపై వుండిపోయారు. ప్రమాదాన్ని అటుగా వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గమనించారు. వెంటనే తన కాన్వాయ్‌ని రోడ్డు పక్కన ఆపారు..ధైర్యంగా ఉండాలని ఏమీ కాదని వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి క్షతగాత్రులను భయపడాల్సిన అవసరం లేదని.. ధైర్యంగా ఉండాలని సూచించారు. అక్కడ తమ వ్యక్తులు ఉంటారని, ఏమైన అవసరం ఉంటే తనకు ఫోన్ చేయాలని అన్నారు. అయితే.. మంత్రి పొంగులేటిది పెద్ద మనసు అని ఆయన అనుచరులు, అభిమానులు అంటున్నారు. కష్టం వస్తే అన్నీ పక్కనపెట్టి ముందుంటారు. ఎలాంటి ఆపద వచ్చినా తక్షణమే స్పందిస్తారని అన్నారు.
Sankranthi Movies: సంక్రాంతి సినిమాల్లో ఏ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రాబట్టాలో తెలుసా?
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!