కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్‌ భేటీ

ప్రధాని మోడీతో సమావేశ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం జగన్ చర్చలు జరిపారు. ఈమేరకు విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జగన్‌ అందించారు. ప్రత్యేక హోదా అంశం, సవరించిన పోలవరం అంచనాలకు ఆమోదం. రెవెన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించిన సీఎం జగన్‌.

ఇవే కాకుండా రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్‌ సమస్యలను మంత్రికి నివేదించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల మంజూరు అంశంపై కూడా జగన్‌ చర్చించారు. రాష్ర్ట విభజనతో ఏపీ చాలా నష్టపోయిందని సీఎం జగన్‌ అన్నారు. విభజన వల్ల 58శాతం జనాభాకు కేవలం 45శాతం రెవెన్యూ మాత్రమే దక్కిందన్నారు.

Related Articles

Latest Articles