మంత్రి కేటీఆర్ నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్ వెల్‌కు పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఉదయం 9.45 గంటలకు పెద్దవూర మండలం సుంకిశాలకు చేరుకుంటారు. హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ఇన్‌టెక్ వెల్ పంపింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొంటారు.
ఉదయం 10.45 గంటలకు నందికొండ మున్సిపాలిటీకి చేరుకుని బుద్ధావనం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంభందించిన రూ.56 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం హైదరాబాద్ బయలుదేరుతారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో అభివృద్ధి ప్రణాళిక చకచకా ముందుకు సాగుతున్నది. ఉప ఎన్నికల సమయంలో సాగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కీలకమైన నెల్లికల్లు లిఫ్టుతో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీల అభివృద్ధి, డిగ్రీ కళాశాల ఏర్పాటు, కాల్వల వెంట బ్రిడ్జిల నిర్మాణం, అన్ని గ్రామాలకు ప్రత్యేక నిధుల కేటాయింపు ఇలా అనేక కార్యక్రమాలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దాంతో అంశాల వారీగా పరిపాలన అనుమతులు ఇస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే నెల్లికల్లు లిఫ్ట్ పనులు శరవేగంగా జరుగుతుండగా మున్సిపల్ కేంద్రాల్లో పలు పనులకు శనివారం జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పునాదిరాయి వేయనున్నారు. జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు సంబంధించి సుమారు రూ.56కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రులు శంకస్థాపన చేయనున్నారు. ఉప ఎన్నికల తర్వాత కేటీఆర్ తొలిసారి నాగార్జునసాగర్ నియోజకవర్గానికి వస్తుండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Gyanvapi mosque survey: జ్ఞానవాపీ మసీదు సర్వే… వారణాసిలో భద్రత కట్టుదిట్టం