Minister KTR: ఆ గట్టున రాబందు మోడీ.. ఈ గట్టున రైతుబంధు కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Speech In Naranapuram Road Show: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం నారాయణపురంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నిక రాజగోపాల్, ప్రభాకర్ రెడ్డి, స్రవంతి మధ్య పోటీ కాదని.. రెండు భావజాలాల మధ్య పోటీ అని పేర్కొన్నారు. ఆ గట్టున రాబందు మోడీ ఉంటే, ఈ గట్టున రైతుబంధు కేసీఆర్ ఉన్నారని.. మునుగోడు ప్రజలు ఏ గట్టున ఉంటారో నిర్ణయించుకోవాలని సూచించారు. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే.. 14 నెలల్లోనే తాము మునుగోడును బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, కాలేజీలు, పోడు భూముల సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తనదేనన్నారు.
మందు, మటన్ పెట్టగానే గందరగోళానికి గురి కావొద్దని.. ఎవరి వల్ల మన బతుకులు బాగుపడుతాయో ఆలోచించుకోవాలని కేటీఆర్ కోరారు. మనది పేదల ప్రభుత్వమని.. బీజేపీది మాత్రం పెద్దల ప్రభుత్వమని విమర్శించారు. 18 వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్.. ఇంటింటికీ తులం బంగారం ఇచ్చినా ఇస్తాని, అలా ఇస్తే ఆ బంగారాన్ని తీసుకోవాలని, ఎందుకంటే అవన్నీ దొంగల పైసలని ఆరోపించారు. బీజేపీకి ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. డబ్బుకో, మందుకో లొంగిపోయి బీజేపీకి ఓటు వేస్తే.. మన కంట్లో మనమే పొడుచుకున్నట్టు అవుతుందని తెలిపారు. ఆగం కాకుండా ఆలోచన చేయమన్న కేటీఆర్.. మునుగోడును సస్యశ్యామలం చేయబోతున్నామని, రాచకొండకి కూడా లిఫ్ట్‌లు పెట్టిస్తామని మాటిచ్చారు.
Also Read
- AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
సాధారణంగా ఎమ్మెల్యేలు పైకి పోతే ఉప ఎన్నిక వస్తుందని.. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోవడం వల్ల ఉప ఎన్నిక వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. 18 వేల కాంట్రాక్ట్‌కు మునుగోడు ఆత్మగౌరవాన్ని రాజగోపాల్ తాకట్టు పెట్టారని, నాలుగేళ్లలో ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. అటు కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక ఒక్క మంచి పని కూడా చేయలేదని, మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక సిలిండర్ ధర రూ. 1200లకు, పెట్రోల్ ధర రూ. 110 పెరిగిందని పేర్కొన్నారు. పలివెలలో బీజేపీ గుండాలు దాడులు చేశారని, ఓడిపోయేటోడే ఇలా చేస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు పోలిన గుర్తులను కొందరు దొంగలు తీసుకొచ్చారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్‌కే ఓటు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!