KTR Tweet: పార్లమెంట్ లో పదాల నిషేధంపై సీరియస్ .. ఉదహరిస్తూ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొద్దిరోజుల క్రితం ప్రజల వేషధారణ, భాషలపై నియంతృత్వ ధోరణి ప్రదర్శించిన బీజేపీ సర్కార్ ఇప్పుడు.. పార్లమెంట్లో కొన్ని పదాలను వాడకూడదంటూ నిషేధిత జాబితాలో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కేటీఆర్ ట్వీటర్ వేదికగా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ఉత్తర్వులపై మండిపడుతూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. అయితే.. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ) గవర్నమెంట్ పార్లమెంట్ లాంగ్వేజ్ ఇదే అని కేటీఆర్ కొన్నింటిని ఉదహరిస్తూ ట్వీట్ చేయడం చర్చకు దారితీస్తోంది. ప్రధానిపై విరుచుకుపడుతూ.. ఆందోళనకారులను ఆందోళన్ జీవి అని ప్రధాని పిలవడం వారి పార్లమెంట్ భాష అని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఓమంత్రి వ్యాఖ్యానించిన గోలి మారో సాలోం కో అనే వ్యాఖ్యం.. 80-20 అని యూపీ సీఎం వ్యాఖ్యానించడం.. మహాత్మాగాంధీని కించపరిచిన బీజేపీ ఎంపీ తీరుపై, ఆందోళన చేస్తున్న రైతులను అవమానపరుస్తూ వారిని టెర్రరిస్టులు అని సంబోధించడంపై వారి పార్లమెంట్ భాష అని పేర్కొంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
read also:Bonalu 2022: రేపే లష్కర్ బోనాలు.. భారీ బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
- Bathukamma 2026: రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా రౌడీ పెయిర్!
- Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
- TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
అయితే.. జూలై సోమవారం నుంచి (18వ) తేదీ నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్ సభ, రాజ్యసభలో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్ సభ సెక్రటేరియట్ ఒక బుక్‌లెట్‌ను ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఇకపై జుమ్లాజీవి, కొవిడ్ స్పైడర్, స్నూప్‌గేట్, వంటి ఇంగ్లీష్ పదాలనే కాకుండా.. అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్ వంటి పదాలను పార్లమెంట్లో నిషేధించింది. కాగా.. వాటిని ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీలులేదు. వాటితోపాటు చంచా, చంచాగిరి, అసత్య, అహంకార్, గూన్స్, అప్మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
Parliamentary language of NPA Govt
✅ PM calling protesters “Andolan Jeevi” is fine
✅” Goli Maaron Saalon Ko” by Minister is okay
✅ “80-20” by UP Chief Minister is okay
✅ Denigration of Mahatma Gandhi by BJP MP is fine
✅ Farmer protesters insulted as “Terrorists” is fine pic.twitter.com/0Q4nfUmuET— KTR (@KTRTRS) July 16, 2022
తాజావార్తలు
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!