NTV Telugu Site icon

Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. ఈటల వద్దకు కేటీఆర్..!

Ktr Eatala

Ktr Eatala

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. కేటీఆర్ రాగానే ఈటల రాజేందర్ ఒకరినొకరు పలకరించుకున్నారు. దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకొని చిరునవ్వుతో పలకరించుకున్నారు. స్వయంగా ఈటల రాజేందర్ సీటు వద్దకు వెళ్లిన కేటీఆర్ గత సమావేశాల్లో చాలా సేపు మాట్లాడారు. చాలా కాలంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఈటల రాజేందర్‌ కూడా రాలేదు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గత సమావేశాల్లో అనూహ్యంగా కేటీఆర్, ఈటల పలకరించడం చర్చనీయాంశమైంది. తాజా సమావేశాల్లోనూ అదే సీన్ రిపీట్ కావడం గమనార్హం. ఈటెలకు ప్రాణహాని ఉందని ఇటీవల ఆయన సతీమణి జమున స్వయంగా వ్యాఖ్యానించడంతో.. తానే స్వయంగా భద్రత కల్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ బంధం మరింత దృఢమైందని, తాజా సమావేశాల్లో గతం కంటే ఎక్కువ ఆప్యాయంగా మాట్లాడుకోవడమే ఇందుకు నిదర్శనమని గులాబీ నేతలు అభిప్రాయపడ్డారు.

Read also: Tomato Price: పెరుగుతున్న టమోటా ధరలు.. కొద్దిరోజుల్లో రూ. 400?

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయిచంద్ కు సభ నివాళులర్పించింది. సాయన్న మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సాయం లేని లోటు తీర్చలేమన్నారు. కంటోన్మెంట్ ను జీహెచ్ ఎంసీలో విలీనం చేసేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. సాయన్న అట్టడుగు వర్గాలకు చెందిన నాయకుడని అన్నారు. సాయన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మిగిలిన సభ్యులు కూడా సాయన్న మృతికి సంతాపం తెలుపుతూ సభా వేదికపై ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సాయన్న మృతికి శాసన సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ రేపటికి (శుక్రవారం) వాయిదా పడింది.
Bandi Sanjay: తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురండి.. బండి సంజయ్ తో ప్రధాని మోడీ

Show comments