తెలంగాణలో త్రి ఐ మంత్ర నడుస్తుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర సమాచారాన్ని సమగ్ర కుటుంబ సర్వేతో సేకరించి అభివృద్ధి ప్రారంభించాం. ఈ రోజు తెలంగాణలో జరిగేది…రేపు దేశంలో జరుగుతుంది. పరిపాలన సంస్కరణలకు ఈ 7 ఏళ్ళు సువర్ణ యుగం. పది జిల్లాలు ఉన్న జిల్లాలను 33 జిల్లాలుగా చేసి పరిపాలన సౌలభ్యంగా మార్చుకున్నాం. 12769కి పంచాయతీలను పెంచాం. పంచాయతీ రాజ్ కొత్త చట్టంతో అనేక సంస్కరణలు తెచ్చాం. ప్రతీ పల్లె ఒక ఆదర్శ గ్రామంగా మారింది. మున్సిపల్ లో పేరుకుపోయిన అవినీతిని కడిగి పారేసే విధంగా కొత్త ఛట్ఠం తెచ్చాం. శాంతి భద్రతలను పటిష్టం చేశాం, భద్రతలో తెలంగాణను నెంబర్ వన్ గా మార్చాం. పరిపాలన సంస్కరణలు మెచ్చుకునేలా చేశాం అన్నారు.
ఇక భూ రికార్డుల ప్రక్షాళన 95 శాతం పూర్తయింది. భూ రికార్డుల సంస్కరణలో రికార్డ్ సృష్టించాము. చట్టం ఎవరి చుట్ట0 కాదు… అని అంటారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి చట్టం… తెలంగాణ ప్రజల చుట్టం. సాగునీటి శాఖను ఒకే గొడుగు కిందకు తెచ్చాం. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కే విధంగా జోనల్ విధానం తెచ్చాం. నాడు కరెంట్ అంటే సంక్షోభం… నేడు కరెంట్ అంటే సంతోషం. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉంది. ఆగం అయిపోతుంది అనుకున్న తెలంగాణ నేడు ఆదర్శంగా మారింది. గూగుల్ కి గుండె కాయ హైదరాబాద్.. అమెజాన్ కి హైదరాబాద్ ఆయువు పట్టు అని తెలిపారు. ఇక ఐటి అంటే ఇన్క్రెడిబుల్ తెలంగాణ. పరిశ్రమలు అంటే టాటా లే కాదు… కులవృత్తులు అని నమ్మి ప్రోత్సహిస్తున్నాం కేంద్రం ఉన్న పరిశ్రమలను కేంద్రం ఉడగొడుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.