Minister KTR: బ్రేకింగ్.. భద్రాచలంలో భారీ వర్షం.. కేటీఆర్ పర్యటన రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన రద్దైంది. భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో భద్రాచలం పర్యటన రద్దు చేసుకొని కేటీఆర్ సత్తుపల్లి పయనం అయ్యారు. భద్రాచలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం రావడంతో మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం భద్రాచలం సత్తుపల్లిలో ఈరోజు మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుండగా ఉదయం ఖమ్మంలో పర్యటన పూర్తయింది. అనంతరం తిరిగి భద్రాచలం వెళ్లడానికి సిద్ధమవుతుండగా భద్రాచలంలో భారీ వర్షం , వాతావరణ అనుకూలించక పోవడంతో హెలికాప్టర్ కి సమస్య ఎదురైంది. ఈనేపథ్యంలో భద్రాచలం పర్యటన కేటీఆర్ రద్దు చేసుకుని సత్తుపల్లి వెళ్లారు. ప్రస్తుతం సత్తుపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది.
ఖమ్మం భద్రాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉదయం ప్రారంభమైంది. హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకుని ఖమ్మంలో 1370 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పథకాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఖమ్మం మున్నేరుపై తీగల వంతెన, అదేవిధంగా మున్నేరు వల్ల ముంపును అరికట్టేందుకోసం ఆర్ సిసి వాల్ నిర్మాణాలను శంకుస్థాపనలు చేసిన అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రగతి నివేదన సభ నిర్వహించారు. ఖమ్మం నుంచి మళ్లీ భద్రాచలం బయలుదేరే సమయంలో వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకుని సత్తుపల్లికి పయనం అయ్యారు. సత్తుపల్లిలో 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకి మంత్రులు కేటీఆర్ పువ్వాడ అజయ్ లు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. తర్వాత సత్తుపల్లిలో జరగనున్న భారీ బహిరంగ సభ ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.
Also Read
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
సత్తుపల్లిలో షెడ్యూల్ ఇలా..
* మధ్యాహ్నం 2.30 గంటలకు సత్తుపల్లి చేరుకుంటారు.
* 2.35 గంటలకు జ్యోతి నిలయం స్కూల్ దగ్గర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
* 2.45 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అంబేద్కర్ ఆడిటోరియానికి శంకుస్థాపన చేస్తారు.
* 3 గంటలకు ఎన్టీఆర్ నగర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
* 3.15 గంటలకు షాదీఖానాకు, క్రిస్టియన్ భవనానికి, రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.
* 3.45 గంటలకు చంద్రా గార్డెన్స్‌లో జరిగే సభలో పాల్గొంటారు.
* 4.50 గంటలకు సత్తుపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
Minister KTR: రెండు సార్లు మంత్రి కావడానికి కారణం ఆ పేరే..!
తాజావార్తలు
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?