సిరిసిల్ల జిల్లాలో గతంలో చూడలేని అభివృధ్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్… 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నఆయన.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. సిరిసిల్ల జిల్లాలో సమారు లక్షా 16వేల 577 మంది రైతులకు 812 కోట్ల రూపాయలను ముందష్తు పంట పెట్టుబడి క్రింద రైతుల ఖాతాలలో ప్రభుత్వం నేరుగా జమ చేసిందన్నారు.. ఋణమాఫీ సంబంధించి జిల్లాలో 25 వేల రూపాయలు ఋణం తీసుకున్న 10,289 మంది రైతులకు మొత్తం 36కోట్ల 65 లక్షల రూపాయలను మాఫీ చేశామన్న ఆయన.. ఈ మాఫీ చేసిన డబ్బులు సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలలో రేపటినుండి జమచేయడం జరుగుతుందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే కాళేశ్వరంతో రాష్ట్రంలో జలవిప్లవం వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్… హరితహారంలో భాగంగా జిల్లాలో పచ్చదనం పెంపుకు ఇప్పటివరకు 3కోట్ల 84 లక్షల మొక్కలను నాటడం జరిగిందన్న ఆయన.. దేశంలో మొక్కల పెంపకంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గర్వకారణం అన్నారు.. మిషన్ భగీరథ పథకం క్రింద సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీ మరియు 12 మండలాలలో 5లక్షల 50వేల మంది ప్రజలకు త్రాగునీరు కొరకు ఒకవేయి 258 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందన్న ఆయన.. 57 సంవత్సరాలు నిండి అర్హులైన పెన్షన్ దరఖాస్తు చేసుకున్న 14,108 మంది లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కలగనుందన్నారు.. ఇక, జిల్లా కేంద్రంలో 159 కోట్ల రూపాయలతో 300 పడకల సామర్థ్యంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు కేటీఆర్.. రూ.2.20 కోట్లతో ఖరీదైన సిటీ స్కాన్ సేవలు అందుబాటులో తీసుకువచ్చామని.. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం పటిష్ఠమైన వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు.
మరోవైపు టీఎస్ ఐ పాస్ పథకం ద్వారా జిల్లా ఏర్పాటు అయినప్పటి నుండి ఒక వేయి 156 కోట్ల 43 లక్షల రూపాయల పెట్టబడులతో 608 పరిశ్రమలు స్థాపించబడ్డాయని వెల్లడించారు మంత్రి కేటీఆర్.. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలో మౌళిక వసతుల కల్పన అభివృధ్ధి పనులను 100 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపడుతోందన్నారు.. వీధి విక్రయదారులకు ఋణాలు అందించడంలో సిరిసిల్ల దేశంలోనే అగ్రగామిగా నిలలడం గర్వకారణంగా చెప్పిన మంత్రి.. సిరిసిల్ల నేతన్నలకు ఉపాధికై 2,500 కోట్ల రూపాయల విలువైన బతుకమ్మ చీరల ఉత్పత్తికై ఆర్డర్లు ఇస్తోందని గుర్తుచేశారు. దళిత బంధు పథకంతో దళిత కుటుంబాలకు బ్యాంక్ లింకేజీ సంబంధం లేకుండా 10లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం అందించనుందని వెల్లడించారు మంత్రి కేటీఆర్.