NTV Telugu Site icon

Minister Komati Reddy: నువ్వు బీఆర్‌ఎస్‌లో ఉద్యోగి మాత్రమే.. హరీష్‌ రావుకు కోమటిరెడ్డి కౌంటర్‌

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Minister Komati Reddy: నువ్వు బీఆర్‌ఎస్‌లో ఉద్యోగి మాత్రమే.. హరీష్‌ రావు కు మంత్రి కోమటిరెడ్డి వెంటక్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. హరీష్ రావు..నాటకాల రాయుడు అన్నారు. పెద్ద జోకర్ గా మారిపోయాడన్నారు. రాజీనామా ప్రొఫార్మలో ఇస్తార అనుకున్నారు ప్రజలు అంటూ వ్యంగాస్త్రం వేశారు. రాజీనామా లేఖ చూస్తే పెద్ద జోకర్ అని ప్రూవ్ అయిపోయిందన్నారు. హరీష్ రావు అనాలా.. హౌల రావు అనాలా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయకుల చంపిన వ్యక్తి హరీష్ రావు అన్నారు. ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ చేస్తాం అని సీఎం చెప్పారన్నారు.

Read also: Fire Accident : అగ్నిప్రమాదంలో గ్రామం మొత్తం దగ్ధం.. 40 ఇళ్లు బూడిద

మీరు చేసిన పాపాలుతో 26 లక్షల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. హరీష్…పార్టీ అధ్యక్షుడివా ? కేసీఆర్.. కవిత..సంతోష్ లదే నడిచిందన్నారు. యజమాని దగ్గర ఉద్యోగి మాత్రమే.. జూన్ 4 నుండి బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్నారు. నాటకాలు ఆడటానికి రాజీనామా లేఖ అన్నారు. మళ్ళీ జోకర్ వేషాలు మొదలు పెట్టాడు హరీష్ రావు అని మండిపడ్డారు. అగ్గి పెట్టె దొరకని వాడు.. ఇప్పుడు రాజీనామా కూడా చేయరాదన్నారు. పబ్లిక్ ఎప్పుడు ఫూల్ కారుని తెలిపారు. నీ పార్టీ.. కుటుంబం మోసాల పార్టీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌలేష్ రావు గా పిలిస్తాం మేము ఇప్పటి నుండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మినిష్టర్ గా దద్దమ్మవి.. మీ మామా దొంగ దీక్ష చేసిండు.. నువ్వు దొంగ రాజీనామ చేసినావని మండిపడ్డారు.

Read also: KCR Bus Yatra: నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ లో కేసీఆర్‌ పర్యటన.. రోడ్‌ షో

కేసీఆర్ కి గులాం గిరి చేయడమే నీకు.. ఇంతకు మించి ఏం ఉండదన్నారు. రుణమాఫీ అంటే అందరికి పూర్తి స్థాయిలో చేస్తామన్నారు. సోనియాగాంధీ చేశారు పెద్ద మొత్తము లో మాఫీ.. పిరికి పందా నువ్వు..ఎమ్మెల్యే పదవి వదులుకోవడానికి భయపడుతున్నావన్నారు. నేను మంత్రి పదవీ వదిలేశా..దళిత సీఎం అన్నాడని గుర్తు చేశారు. చేయకుంటే నా మెడ మీద తలకాయ ఉండదు అన్నాడని పేర్కొన్నారు. మొదటి సారి చేయలేదు.. రెండో సారి చేయలేదు.. మార్చి 1 న జీరో బిల్లు వచ్చిందా లేదా ? 500 సిలిండర్ వచ్చిందా లేదా ? ఐదు నెలల్లో పిచ్చి పట్టింది బీఆర్ఎస్ వాళ్లకు.. కట్టే పట్టుకుని ఇప్పుడు బయలు దేరాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ని ఎం చేసినా తప్పు లేదన్నారు.

Read also: Harish Rao: నా రాజీనామా ఆమోదించండి.. స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ..

రైతులకు ఉచిత ఎరువులు అన్నాడు.. ఇచ్చినవా? దళితుణ్ణి సీఎం చేయకపోతే తల తీసుకుంటా అన్నావు.. తీసుకున్నవా? మేము తీసేయాలా? దళితులన్న వచ్చి తీయాలా? అని ప్రశ్నించారు. కామన్ సెన్స్ లేకుండా హౌలేష్ డ్రామాలు చేస్తున్నాడన్నారు. నోరా..మొరా.. ఏమైందిరా మీకు అంటూ నిప్పులు చెరిగారు. ఇంద్రభవనం నుండి బయటకు రాగానే మెంటల్ ఎక్కిందన్నారు. బిడ్డ జైల్లో ఉంది కాబట్టి.. మైండ్ సెట్ తేడా వచ్చిందన్నారు. బస్సులు వెళ్లి చూసి రాక ముందే కూలిపోయింది కాళేశ్వరం.. 8 నుండి 12 ఎంపీ సీట్లు వస్థాయి అన్నాడు కేసీఆర్.. ఈబీఎం మిషన్ల్ రిగ్గింగ్ చేద్దాం అనుకున్నాడా కేసీఆర్ అంటూ మండిపడ్డారు.

Read also: Ponnam Prabhakar: ఫిబ్రవరి 23, 2023న రుణమాఫీ చేస్తానన్నారు చేశారా? హరీష్ రావు కు పొన్నం ప్రశ్న..

కేటీఆర్ బామ్మర్ది బినామీ కంపెనీతో 270 కోట్లు తిన్నారని గుర్తు చేశారు. ఇంటర్ కం సిస్టం కి 50 కోట్లు ఐపోతాది.. కానీ 220 కోట్లు దోచుకున్నాడు కేటీఆర్ అంటూ మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేయక పోతే దేనికైనా సిద్ధం అన్నారు. రాజీనామాలు చిన్న విషయం.. రైతులకు మాట ఇస్తున్నాం… పంట రుణమాఫీ చేస్తాం అన్నారు. రాజీనామా ప్రొఫార్మ సింగిల్ లైన్ లో ఉంటది.. సింగిల్ లైన్ ఎలా రాయాలో కోమటిరెడ్డి చదివి వినిపించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ కి తెలియదా అన్నారు. సినిమా స్టోరీ రాసినట్టు రెండు పేజీల లేఖ రాశారు హరీష్ అంటూ మండిపడ్డారు.
Adulterated Mutton: కామారెడ్డిలో నాణ్యతలేని మటన్ కలకలం.. కుక్క గాట్లు గుర్తించిన జనం..