Hyderabad CP: నిరుద్యోగ యువతకు జీతాలు ఇచ్చి మొబైల్ స్నాచింగ్ కి చేయిస్తున్నారని హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నడుచుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్ గా చేసుకొని మొబైల్ స్నాచింగ్ చేస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నారని తెలిపారు. రాత్రి 10 గంటలు తరువాత ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మూడు కమిషనరేట్లలో ఇలా మొబైల్ స్నాచింగ్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. రోజుకు 3 నుండి నాలుగు కేసులు నమోదు అయ్యాయని అన్నారు.
Read also: KCR Bus Yatra: నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ లో కేసీఆర్ పర్యటన.. రోడ్ షో
ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్న ముఠా ఇంటర్నేషనల్ ముఠాగా గుర్తించామన్నారు. 7 కేసులు హైదరాబాద్ లో మొబైల్ స్నాచింగ్ చేసినట్లు గుర్తించామమని తెలిపారు. బైక్ దొంగతనం కేసు ఎల్బీ నగర్ కేసును ఛేదించామన్నారు. సూడాన్ దేశానికి చెందిన 5 మంది ఇల్లిగల్ గా హైదరాబాద్ లో ఉంటున్నట్లు గుర్తించారని అన్నారు. హైదరాబాద్ లో దొంగతనం చేసిన మొబైల్స్ ను సూడాన్ కి పంపుతున్నట్లు గుర్తించామమని తెలిపారు. నిరుద్యోగ యువతకు జీతాలు ఇచ్చి మొబైల్ స్నాచింగ్ కి చేయిస్తున్నారని అన్నారు. ఈ కేసులో 12 నిందితులు హైదరాబాద్ కి చెందిన వారు ఉన్నారు, 5 గురు నిందితులు సూడాన్ కి చెందిన వారని తెలిపారు.
Read also: Harish Rao: నా రాజీనామా ఆమోదించండి.. స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ..
స్నాచింగ్ చేసిన మొబైల్ ఫోన్స్ అమ్మకాలకు, రిసివింగ్ కి జగదీష్ మార్కెట్ కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిందన్నారు. స్నాచింగ్ చేసిన మొబైల్ ఫోన్స్ ను విడివిడి భాగాలను కూడా అమ్ముతున్నారని తెలిపారు. సూడాన్ కి చెందిన ఐదుగురిలో నాయకుడు ఆల్‌బాద్వీగా గుర్తించామన్నారు. సముద్రం మార్గం ద్వారా సూడాన్ కు మొబైల్స్ ను పంపుతున్నట్లు గుర్తించిన్లు వెల్లడించారు. సీ ఫుడ్ ను తరలించే థర్మల్ బాక్సులలో సూడాన్‌కు అల్‌బాద్వి సెల్‌ఫోన్లు తరలిస్తున్నట్లు తెలిపారు. కోటి 75 లక్షలు విలువైన 703 స్మార్ట్ ఫోన్స్ , బైక్ ను సీజ్ చేశామన్నారు. జగదీశ్ మార్కెట్ పై ప్రత్యేక నిఘా పెంచామన్నారు. చోరీ చేసిన స్మార్ట్ ఫోన్‌ల విడిభాగాలను కంపెనీకి చెందిన ఒరిజినల్ పార్ట్స్ ను విక్రయిస్తున్నారని తెలిపారు.
Ponnam Prabhakar: ఫిబ్రవరి 23, 2023న రుణమాఫీ చేస్తానన్నారు చేశారా? హరీష్ రావు కు పొన్నం ప్రశ్న..