KCR Bus Yatra: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర 24వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రలో భాగంగా.. ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు.
Read also: Harish Rao: నా రాజీనామా ఆమోదించండి.. స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ..
పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వరకు భారీ రాస్తారోకో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడతారు. రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో బస చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో చర్చలు జరపనున్నారు. బస్సు యాత్ర రేపు (శనివారం) నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటుంది. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ అభ్యర్థులకు మద్దతుగా సభ జరగనుంది. బీఆర్‌ఎస్ శ్రేణులు జన సమీకరణకు కృషి చేస్తున్నాయి.
Read also: Ponnam Prabhakar: ఫిబ్రవరి 23, 2023న రుణమాఫీ చేస్తానన్నారు చేశారా? హరీష్ రావు కు పొన్నం ప్రశ్న..
లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం, ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ బస్సుయాత్ర చేయాలని వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ ఉంది. అయితే సమయాభావం, ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాల్లో మాత్రమే బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. కేసీఆర్ యాత్ర పొడవునా 100 మందికి పైగా వాలంటీర్లు వాహన శ్రేణి వెంట రానున్నారు. కాగా.. మిర్యాలగూడలో ప్రారంభమైన యాత్ర సిద్దిపేటలో బహిరంగ సభతో ముగుస్తుంది.
Adulterated Mutton: కామారెడ్డిలో నాణ్యతలేని మటన్ కలకలం.. కుక్క గాట్లు గుర్తించిన జనం..