TTP Terror Attack: ఉగ్రవాదం అనే పాముకు పాలు పోసి పెంచింది పాకిస్థాన్. పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. నువ్వు ఏం చేస్తే అది నీకు తిరిగి వస్తుందని. ఇది పాకిస్థాన్ విషయంలో వందకు వంద శాతం నిజం అని రుజువు అయ్యింది. ఏ పామును అయితే పాక్ పెంచి పోషించిందో ఇప్పుడు ఆ ఉగ్రవాదం అనే పాము వాళ్లనే కాటువేస్తుంది. శనివారం తెల్లవారుజామున వాయువ్య పాకిస్థాన్‌లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) జరిపిన మెరుపుదాడిలో కనీసం 12 మంది పాక్‌స్థాన్ సైనికులు మరణించినట్లు సమాచారం. ఈ సంఘటనను స్థానిక పరిపాలన, భద్రతా అధికారులు ధృవీకరించారు.
READ ALSO: Nalgonda: పదో తరగతి విద్యార్థినిపై ప్రభుత్వ ఉపాధ్యాయుడి వేధింపులు.. మూడు నెలలుగా…
ఇంతకీ ఏం జరిగింది..
శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దక్షిణ వజీరిస్థాన్ జిల్లా గుండా వెళుతున్న సైనిక కాన్వాయ్‌పై టీటీపీ ఉగ్రవాదులు రెండు వైపుల నుంచి భారీ ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది సైనికులు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం ఉగ్రవాదులు కాన్వాయ్ నుంచి ఆయుధాలను దోచుకున్నారు. ఈ దాడికి తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) బాధ్యత వహిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ దాడి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద దాడులలో ఒకటి.
ఇటీవల కాలంలో ఖైబర్ పఖ్తుంఖ్వాలోని అనేక ప్రాంతాలలో TTP పేరుతో గోడలపై నినాదాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా ఈ ప్రాంతాన్ని ఉగ్రవాదులు మళ్లీ స్వాధీనం చేసుకుంటారనే భయం స్థానిక ప్రజల్లో పెరుగుతోందని అక్కడి వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో టీటీపీ ఉగ్రవాదుల ఉనికి, దాడుల సంఖ్య పెరిగాయని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. జనవరి 1 నుంచి ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్లలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో సుమారు 460 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా దళాల సిబ్బందే ఉన్నారు.
2014లో జరిగిన ఒక పెద్ద సైనిక చర్య తర్వాత TTP ఉగ్రవాదులు వెనక్కి తగ్గినప్పటికి, 2021లో ఆఫ్ఘన్ తాలిబన్లు కాబూల్‌కు తిరిగి వచ్చిన నాటి నుంచి పాకిస్థాన్-ఆఫ్ఘన్ సరిహద్దులో తిరిగి టీటీపీ ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రమయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్ తన నేల నుంచి ఉగ్రవాదులను ఆపడంలో విఫలమైందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే కాబూల్‌లోని తాలిబన్ సర్కార్ పాక్ ఆరోపణలను ఖండిస్తోంది. గత ఏడాది కాలంలో పాకిస్థాన్ దాదాపు పదేళ్లలో అత్యంత ఎక్కువ రక్తపాతాన్ని చూసింది. గత ఏడాది సమయంలో 1,600 మందికి పైగా మరణిస్తే, వారిలో సగానికిపైగా సైన్యం, పోలీసులు ఉన్నారు.
READ ALSO: Dammannapet : దమ్మన్నపేటలో అడవి హక్కులపై ఘర్షణ, ఫారెస్ట్ అధికారులపై ఆదివాసీల ఆగ్రహం