NTV Telugu Site icon

Minister Jagadish Reddy: భట్టి విక్రమార్క విమర్శలకు మంత్రి జగదీశ్ స్ట్రాంగ్ కౌంటర్

Jagadish Counter To Bhatti

Jagadish Counter To Bhatti

Minister Jagadish Reddy Strong Counter To Bhatti Vikramarka: బీఆర్ఎస్ పార్టీపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన విమర్శలకు మంత్రి జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లు పడకేయడానికి కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలే కారణమని ఆరోపించారు. కర్ణాటకలో బీఆర్ఎస్ పార్టీ లేదని, మరో దిక్కు లేక అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని ఎద్దేవా చేశారు. చర్చలకు తామూ సిద్ధమేనని, ఎక్కడకు రమ్మంటారో కాంగ్రెస్ నేతలే చెప్పాలని ఛాలెంజ్ చేశారు. దశాబ్ది ఉత్సవాలకు వచ్చి, ప్రజలు చెప్తున్న మాటలు వింటే అన్ని తెలుస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ రాష్ట్రానికి లక్ష సార్లు క్షమాపణ చెప్పాలని.. ముక్కు కూడా నేలకు రాయాలని.. ఇది ప్రజల డిమాండ్ అని చెప్పారు.

Vikarabad Sireesha Case: మొబైల్ ఫోన్ పరిశీలిస్తే, అసలు నిజం తెలుస్తుంది – శిరీష అక్క

ఢిల్లీ పెద్దల కోసం, ఆంధ్రా నేతల కోసం, పదవుల కోసం.. తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ నేతలు తాకట్టు పెట్టారని మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. గోబెల్స్‌కు మించి తెలంగాణలో కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు, వెనకబాటుకు, ఫ్లోరైడ్ సమస్యకు, సాగు, తాగు నీటి కష్టాలకు కాంగ్రెస్ నేతలే కారణమని ఉద్ఘాటించారు. నిధులు, నీళ్లు, నియామకాలకు వంద శాతం న్యాయం తామే చేశామన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో.. అక్కడి ప్రభుత్వం ఇస్తున్న కరెంట్ ఎంత? కొనుగోలు చేస్తున్న ధాన్యం ఎంత కాంగ్రెస్? దీనిపై చర్చకు సిద్ధమా? అని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కేవలం ధరణిని మాత్రమే కాకుండా, సంక్షేమ పథకాలన్నింటిని రద్దు చేస్తారని చెప్పుకొచ్చారు.

WTC FINAL 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత ఆస్ట్రేలియా.. ఇండియా ఘోర పరాజయం

కాగా.. అంతకుముందు నల్లగొండ జిల్లాలో తన పాదయాత్రలో భాగంగా బీఆర్ఎస్ పార్టీపై భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని.. ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే సాగు నీళ్లు ఇస్తున్నామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాకు అతి ఎక్కువ నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని.. అందుకు క్షమాపణ చెప్పడమో లేక బహిరంగ చర్చకైనా రావాలని సవాల్ విసిరారు. ఈ కామెంట్లకే మంత్రి జగదీశ్ పై విధంగా రియాక్ట్ అయ్యారు.

Show comments