NTV Telugu Site icon

Munugode Bypoll: ఉప ఎన్నిక బ‌రి నుంచి త‌ప్పుకుంటాం.. మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి సంచలన ప్రకటన

Jagadish Reddy

Jagadish Reddy

మునుగోడు ఉప ఎన్నిక ఓవైపు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న సమయంలో… సంచలన ప్రకటన చేశారు మంత్రి జగదీష్‌రెడ్డి.. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన.. హాట్‌ కామెంట్లు చేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ఛాలెంజ్ చేశారు.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి మోడీ, అమిత్ షా ఇచ్చిన రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టుల‌పై స్పందిస్తూ.. రాజ‌గోపాల్ రెడ్డికి అప్పనంగా క‌ట్టబెట్టిన రూ. 18 వేల కోట్లు.. మునుగోడు, నల్గొండ నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధికి ఇవ్వండి… అలా చేస్తే తాము ఉప ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుంటామని ప్రకటించారు.. మీరు అలా చేస్తే.. ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటాం.. ఈ విష‌యంలో సీఎం కేసీఆర్‌ను ప్రాధేయ‌ప‌డైనా తాను ఒప్పిస్తామ‌ని వెల్లడించారు జగదీష్‌రెడ్డి..

Read Also: Eknath Shinde: మాకు వీటిలో ఓ ఓ గుర్తు కేటాయించండి.. ఈసీకి ఏక్‌నాథ్‌ షిండే వర్గం విజ్ఞప్తి..

తాను.. కమ్యూనిస్టు సోదరుల సాక్ష్యంగా చెబుతున్నా.. ఆయన సొంతానికి ఇచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇవ్వండి అని సవాల్‌ చేశారు.. ఇక, రాజకీయాల కొరకే ఉప ఎన్నికలు సృష్టించారని మండిపడ్డ జగదీష్‌రెడ్డి.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు.. సస్యశ్యామలం అవుతున్న తెలంగాణలో మంటలు సృష్టించే కుయుక్తులు చేస్తున్నారు.. హిందూ మతం గురించి వేదాలు వల్లించే బీజేపీ ప్రభుత్వం.. యాదాద్రి పునర్ నిర్మాణానికి 100 రూపాయల చందా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. హిందూ మతానికి అంబాసిడర్లు అంటూ ఇతర మతాల మీద విషం చిమ్మే బీజేపీ.. యాదాద్రి పునర్ నిర్మాణానికి నిధులు ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు.. గల్లీ, గల్లీ లో కేంద్రమంత్రులు తిరుగుతున్నారు.. ఎవరూ… ఏ ఒక్కరోజు తెలంగాణ అభివృద్ధికి పైసా విదల్చ లేదని ఆరోపించారు.

వడ్డీకి అప్పులు తెచ్చి భవిష్యత్ తరాలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది ఉండొద్ద సంకల్పంతో విద్యుత్‌ ప్లాంట్‌లు నిర్మిస్తున్నాం అన్నారు జగదీష్‌రెడ్డి.. రాజగోపాల్ రెడ్డికి రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ కుట్రలకు తెర లేపేందుకు మాత్రమే ఆయనకు రూ. 18000 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు.. బీజేపీ కుట్రలకు అండగా నిలిచినందుకే రాజగోపాల్ రెడ్దికి రూ.18000 వేల కోట్లు ఇచ్చారు.. ఇప్పటికీ చెబుతున్నా.. ఆ 18,000 కోట్లు మా నల్లగొండ జిల్లాకు, మా మునుగోడుకు ఇవ్వండి.. మునుగోడు నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సూచించారు మంత్రి జగదీష్‌రెడ్డి.

Show comments