Site icon NTV Telugu

Jagadish Reddy : కేంద్రం వైఖరి ముమ్మాటికి మోసపురితమే

Jagadish Reddy

Jagadish Reddy

విద్యుత్ సంస్కరణలపై కేంద్రం వెనకడుగు అంటూ వస్తున్న కథనాలపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం వైఖరిముమ్మాటికి మోసపురితమేనని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించిన మీదటనే ఆ లీకేజీలు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కరణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ ద్వారా తెలిపారని ఆయన వెల్లడించారు. వ్యవసాయ చట్టాలను మళ్ళీ పెడతామంటూ బీజేపీ నేతలు పేర్కొంటున్నారని ఆయన తెలిపారు.

Talasani Srinivas : చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో కళాప్రదర్శనలు

విద్యుత్ సంస్కరణల అంశంలోనూ కేంద్రం అదే వైఖరితో ఉందని ఆయన మండిపడ్డారు.  సంస్కరణలలో మార్పులు మా దృష్టికి రాలేదని, వచ్చాక పరిశీలించి ప్రజల గొంతుకకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టు లాంటివని ఆయన కేంద్ర ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు.

 

Exit mobile version