సిద్దిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైన్ పనులను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైలు త్వరితగతిన సిద్దిపేటకు చేరుకునేలా రైల్వే ట్రాక్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.