హుజురాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు టీఆర్ఎస్ పార్టీ బహిరంగ లేఖ పంపింది. దానికి సమాధానం చెప్పండి అని అడిగారు. నడి రోడ్డుపై రైతులను హత్య చేసి మళ్లి అరైతులనే ఓట్లు అడుగుతారా.. టీఆర్ఎస్ కు రైతులు ఎందుకు ఓటు వెయ్యలో వెయ్యి కారణాలు చెప్తా.. కానీ బీజేపీకి ఎందుకు రైతాంగం ఓటు వెయ్యలో కిషన్ రెడ్డి,బండి సంజయ్ చెప్పాలి అన్నారు.
రైతుల పట్ల దుర్మార్గముగా వ్యవహరిస్తూ నడి రోడ్డుపై రైతులను చంపారు. రైతుల పట్ల సానుభూతి లేదు ఉత్తర ప్రదేశ్ లో వ్యవసాయ చట్టాలును రద్దు చేయాలని శాంతి యుతంగా నిరసన చేస్తుంటే కేంద్ర మంత్రి కొడుకు వారిపై కారు ఎక్కించిండు. రైతులను కర్రలతో కొట్టండి అని చెప్పిన బీజేపీ వాళ్లకు రైతులు ఎందుకు ఓట్లెయాలి. రైతులు అంతా ఖలిస్తాన్ తీవ్రవాదులని బీజేపీ వాళ్ళు ముద్ర వేసిండ్రు అని తెలిపారు. ప్రజాస్వామ్యము గురించి మాట్లాడితే పాకిస్తాన్ అని ముద్ర వేయడం. న్యాయం అడిగితే హిందూస్థాన్ అనడం బిజెపి నాయకుల దుస్థితి. పెట్రోల్ లీటర్ ధర 111.8 డీజిల్ ధర 103.94 రూపాయలు ఉన్నందుకు గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు చేసి సబ్సిడీ 250 నుండి 39 తగ్గించినందుకు ఓటు వేయాలా అని అడిగారు. బీజేపీ డీజిల్ రేట్లు పెంచడం వల్ల రైతులకు వ్యవసాయ ఖర్చు పెరిగింది. ఎఫ్సిఐ ద్వారా ధాన్యం సేకరించేది లేదని మెండిచేయి చూపించింది బీజేపీ అని పేర్కొన్నారు.