NTV Telugu Site icon

Harish Rao: బీఆర్‌ఎస్‌ స్లోగన్‌ సర్కార్‌ కాదు.. సొల్యూషన్‌ సర్కార్‌

Harish Rao

Harish Rao

Harish Rao: బీఆర్‌ఎస్‌ స్లోగన్‌ సర్కార్‌ కాదని, సొల్యూషన్‌ సర్కారని మంత్రి హరీష్‌ రావ్‌ స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే కొన్ని పార్టీలు బూటకపు వాగ్దానాలు చేస్తాయని అన్నారు. కొన్ని పార్టీలు నినాదాలు ఇస్తాయి కానీ నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బూటకపు మాటలు, చిలిపి పనులు చేసే పార్టీలు పెరిగిపోయాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ స్లోగన్‌ సర్కార్‌ కాదని, సొల్యూషన్‌ సర్కారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సొంత రాష్ట్రమైన కర్ణాటకలో అమలు చేయలేదన్నారు. కర్ణాటకలో బీజేపీపై కాంగ్రెస్‌ విజయం సాధించిందన్నారు. అమిత్ షాకు తెలంగాణపై అవగాహన లేదని, ఎవరో ఇచ్చిన స్క్రిప్టును చదివారని ఎద్దేవ చేశారు. అంతకుముందు గుజరాత్ గుడ్డి పాలనను ఆయన సరిదిద్దాలని అన్నారు. యాతాకుల భాస్కర్ దళిత జాతి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.

Read also: Komatireddy: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఈ నెల రోజులైన 24 గంటల కరెంట్ ఇవ్వండి

దళితుల అభివృద్ధికి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు భాస్కర్ ఆకట్టుకున్నాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద రూ.20 లక్షలు ఇస్తోందని, రెసిడెన్షియల్ పాఠశాలలు, 80కి పైగా మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 1200 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి భక్తిని చాటుకున్నామన్నారు. ఆ మహానుభావుడి పేరును పార్లమెంటుకు పెట్టి కేంద్రం ముఖం చాటుకుందని విమర్శించారు. అంబేద్కర్‌ బాటలో నడిచే ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ సర్కార్‌ అని స్పష్టం చేశారు. గిరిజనుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ, కాంగ్రెస్‌లకు లేదన్నారు. తాండాలను గ్రామాలుగా మార్చామని, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మత కలహాలు, కరెంట్ సమస్యలు, నీటి సమస్యలతో సతమతమవుతున్నాయని అన్నారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయాలని, బీఆర్ ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ యాతాకుల భాస్కర్‌ సేవలను తప్పకుండా వినియోగించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానం కల్పిస్తుందని తెలిపారు.
Psycho Husband: ఛీ.. నువ్వు భర్తవా సైకోవా.. భార్యకు విద్యుత్ షాక్ ఇచ్చి..ఉరివేసి చంపాడు