Site icon NTV Telugu

Harish Rao: డాక్టర్లకు దండం పెట్టిన మంత్రి.. దయచేసి పని చేయండి..

Harish Rao

Harish Rao

సంగారెడ్డి జిల్లాలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు సందర్శించారు. ESI హాస్పిటల్ లో డెలివరీలు ఎందుకు చేయట్లేదని డాక్టర్లను మంత్రి ప్రశ్నించారు. ముగ్గురు డాక్టర్లు కలిసి జులై నెలలో 3 డెలివరీలు చేయడంపై మంత్రి సీరియస్ అయ్యారు. మీకు ఇక్కడ పనిలేకుంటే పటాన్ చెరు ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ చేయండి అని చెప్పారు. ESI హాస్పిటల్ లో నాలుగు ఏండ్లుగా డ్యూటీకి రాని 4 డాక్టర్లు పై కూడా మంత్రి ఫైర్ అయ్యారు. డ్యూటీకి రాకుండా నాలుగు సంవత్సరాలు అయిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూపరింటెండెంట్ ని ప్రశ్నించారు.

read also: Monkeypox: భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

డాక్టర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి. హాస్పిటల్ లో డాక్టర్లు ఫుల్ పేషేంట్స్ నిల్ అంటూ కౌంటర్ వేసారు. వైద్య పరికరాలు లేవనే పనిచేయడం లేదని సాకు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మీ సూపరింటెండెంట్ నోడల్ ఆఫీసర్ అయినప్పుడు ఎందుకు వైద్య పరికరాలు తీసుకోలేదని ప్రశ్నించారు. డాక్టర్లకు దండం పెట్టి దయచేసి పని చేయండని, మీ వృత్తికి న్యాయం చేయండని మంత్రి హరీష్ రావు వేడుకున్నారు.
AP SSC Supplementary Results: టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. 64.23 శాతం ఉత్తీర్ణత

Exit mobile version