NTV Telugu Site icon

Minister Harish Rao: వాళ్లు మీవైపు వస్తే చెరువులో ముంచేయండి.. హరీష్‌రావు పిలుపు

Harish Rao

Harish Rao

ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు మంత్రి హరీష్‌రావు… కాళేశ్వరం ప్రాజెక్టుతో చుక్క నీళ్లు రాలేదని కేంద్ర మంత్రులు అంటున్నారు, ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు… వాళ్లు మీ వైపు వస్తే మీ చెరువులో ముంచండి.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయో లేదో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం సిద్దన్ పేటలో నూతన ఆసరా పెన్షన్స్ ను పంపిణీ చేసిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాసంగిలో బోరు బండ్లు కనిపిస్తలేవు.. బోర్లు వెళ్లబోయబట్టే, ఇది మన కాళేశ్వరం పుణ్యమే అన్నారు.. ఒకరు ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతారు,.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లను ఓక్కసారి పట్టుకొచ్చి పేట చెరువులో ముంచుమన్న.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయా? లేవో తెలుస్తుందన్నారు.

Read Also: MLC Kavitha: పెట్రోల్‌ బంకుల్లో, గ్యాస్‌ సిలిండర్లపై మోడీ ఫొటోలు పెడతాం..!

మనం నాట్లు వేయాలంటే ఇతర రాష్ట్రాల నుంచి మగ మనుషులు వచ్చి నాట్లు చేస్తున్నారు.. వడ్లు లారీలో ఎక్కించడానికి బీహార్‌ హమాలీలు వస్తున్నారని తెలిపారు హరీష్‌రావు… కర్ణాటకలో డబుల్ ఇంజన్ అంటున్నారు.. మరి అక్కడ పెన్షన్ రూ. 200లే.. బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారా? ఇస్తే చెప్పమనండి అని సవాల్‌ విసిరారు.. కొంత మంది నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయిన మంత్రి… తెలంగాణలో ఒక గుంట భూమి కొని, పైపు లైన్ ద్వారా నీళ్లు మహారాష్ట్రకు తీసుకెళ్తున్నారని తెలిపారు.. ఇక, సీఎం కేసీఆర్ సారుకు మీ అందరూ చల్లని దీవెనలు ఇవ్వాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్‌రావు.. ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకున్న వ్యక్తి కేసీఆర్ అన్నారు.. చేపలు పట్టుకోవడానికి చెరువుల నుంచి నీరు తీయాలని మత్స్యకారులు అడిగే పరిస్థితి వచ్చింది.. కాళేశ్వరంతో అన్ని చెరువులు నీళ్లతో కలకలలాడుతున్నాయని తెలిపారు. కాగా, వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు.. అధికార టీఆర్ఎస్‌ పార్టీని టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు.. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి కూడా టీఆర్ఎస్‌పై మాటల దాడి జరుగుతోంది.. ఈ నేపథ్యంలో.. మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.