Harish Rao: కాంగ్రెస్ ఒక్కసారి ఛాన్స్ అంటారు.. తర్వాత ఎక్స్‌క్యూజ్‌మీ అని అంటారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో కత్తి కార్తిక చేరారు. మంత్రి హరీశ్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత గజ్వేల్, దుబ్బాక నియోజక వర్గాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్ హరీష్ రావు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చి ఆరు నెలలు పూర్తి కావస్తోందని గుర్తు చేశారు. కానీ.. హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ హయాంలో స్కీమ్ ల రద్దు నడుస్తుందని అన్నారు. బీజేపీ నొట్ల రద్దు చేస్తే… కాంగ్రెస్ ఉన్న పథకాలు రద్దు చేస్తుందని మండిపడ్డారు. కర్ణాటక కాంగ్రెస్ హామీల గురించి అడిగితే ఖజానా ఖాళీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో అంతా చీకటే… రాహుల్ గాంధీ రామ్ రామ్ చెప్పిండని అన్నారు. కర్ణాటకలో కొత్త పథకాలు ఏమో కానీ… ఉన్న పథకాలు పోతున్నాయని అన్నారు. కర్ణాటక సీఎం కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభివృద్ధికి నిధుల కోసం లేఖ రాశారన్నారు.
వెలుగుల దీపావళి కావాలా…కర్ణాటక దివాలా కావాలా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ హయాంలో 357 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఅర్ హయాంలో రైతు ఆత్మ హత్యలు లేవని అన్నారు. కాంగ్రెస్ ఒక్క సారి ఛాన్స్ అంటారు..ఆ తర్వత ఎక్స్‌క్యూజ్‌మీ అంటారని వ్యంగాస్త్రం వేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ పై విపక్షాలు పోరాటం చేస్తున్నాయని అన్నారు. వన్ ఛాన్స్ గాల్లకు బుద్ధి చెప్పాలి…కేసీఅర్ ను మూడో సారి సీఎం చేయాలని అన్నారు. నిరుద్యోగ క్యాలెండర్ అంటూ రాహుల్ గాంధీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీవి గ్యారేంటిలు కాదు… గారడీలు అన్నారు. రాహుల్ గాంధీకి దమ్ము ఉంటే కర్ణాటక మాడల్ అంటూ ఓట్లు అడగాలన్నారు. రాహుల్ గాంధీ ఫేల్యూర్ స్టోరీ అని కీలక వ్యాఖ్యలు చేశారు. చిదంబరం మాటలు …తెలంగాణ అమరుల గాయాలను మళ్ళీ గుర్తు చేశాయన్నారు. అమరుల తల్లుల కాంగ్రెస్ పార్టీని శపిస్తున్నరని మండిపడ్డారు. చంపింది కాంగ్రెస్ …మళ్ళీ సారి చెబుతుంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Matrimonial fraud: పూటకో పేరు.. నిత్య పెళ్లి కొడుకు..