Errabelli Dayakar Rao: కాటమయ్యకు బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ కాటమయ్య బోనమెత్తారు. భక్తుల హర్షధ్వానాల మధ్య కాలమయ్య గుడి చుట్టూ తిరిగి దర్శించుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి తదితర మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పెద్ద వంగర మండలం చిట్యాల గ్రామంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. మహిళలతో కలిసి కాటమయ్యకు బోన మెత్తారు. అనంతరం ప్రజలతో కలిసి కాటమయ్యను దర్శించుకున్నారు.
పెద్ద వంగర మండలం చిట్యాల సురమాంబ శ్రీ కంఠ మహేశ్వర స్వామి దేవాలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరైన మంత్రి మహిళలతో కలిసి బోనం ఎత్తారు. ప్రజలు హర్షధ్వానాల మధ్య ప్రజలతో కలిసి కాటమయ్యను దర్శించుకున్నారు. గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మోత్యా తండాలో.. దుర్గమ్మ పండుగ ఉత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. గుడిని సందర్శించారు. తండా వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
లక్ష్మణ్ తండాలో దుర్గమ్మ పండుగ మండలంలోని లక్ష్మణ్ తండాలో జరిగిన దుర్గమ్మ పండుగ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని దుర్గమ్మ ఆలయాన్ని తండా వాసులతో కలిసి సందర్శించారు. అమ్మ వారికి మొక్కుకున్నారు. గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధిపై చర్చించారు. దేవరుప్పుల కు చెందిన నీలారపు పెద్ద వెంకన్న కు cmrf చెక్కును పంపిణీ చేశారు.
దేవరుప్పుల లో నిన్న మరణించిన కర్ర కొమురయ్య కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. తన సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకుంటున్న యాదగిరి గౌడ్ ని మంత్రి పరామర్శించారు. రామేశ్వరం, పలుగుల తండాలో దుర్గమ్మ పండుగ కొడకండ్ల మండలం రామేశ్వరం, పలుగుల తండాలో దుర్గమ్మ పండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
తండాలో దుర్గమ్మ గుడిని మంత్రి సందర్శించారు. గుడిలో అమ్మ వారికి మొక్కుకున్నారు. సర్పంచ్ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఉన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు, సమస్యల మీద తండా వాసులతో చర్చించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!