NTV Telugu Site icon

Revanth Reddy: పాతబస్తీ మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో.. రూట్ మార్పుతో తగ్గనున్న వ్యయం

Revanth Reddy Old City Metro

Revanth Reddy Old City Metro

Revanth Reddy: ఎయిర్‌పోర్ట్ మెట్రో, ఫార్మా సిటీలను రద్దు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్‌లైన్‌ పనులు జరుగుతున్నాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో దూరం తగ్గిస్తామని చెప్పారు. బీహెచ్‌ఈఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కి.మీ దూరం ఉంటుందని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో లైన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట వద్ద నాగోల్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే మెట్రో లైన్‌కు లింక్‌ ఉంటుందని సీఎం చెప్పారు. అవసరమైతే మియాపూర్‌ నుంచి రామచంద్రాపురం, మైండ్‌ స్పేస్‌ వరకు మెట్రోను విస్తరింపజేస్తామని సీఎం రేవంత్‌ చెప్పారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోల్చితే కొత్తగా ప్రతిపాదించిన మెట్రో కారిడార్లను తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తామని రేవంత్ చెప్పారు. కాలుష్యం లేని ఫార్మాసిటీ, రింగ్‌రోడ్డు, రీజనల్‌ రింగ్‌రోడ్డు మధ్య ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌ చెప్పారు. పరిశ్రమల్లో పనిచేసే వారికి ప్రత్యేక కాస్టర్లతో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

Read also: Liqour Sales New Record: న్యూ ఇయర్‌ జోష్‌.. ఏపీలో రికార్డు స్థాయిలో లిక్కర్‌ సేల్స్‌

కూలీలు హైదరాబాద్ రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. యువతకు అవసరమైన నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేక యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ స్కిల్స్‌కు రెగ్యులర్‌ డిగ్రీలకు సంబంధించిన అన్ని అర్హతలు ఉంటాయని సీఎం రేవంత్‌ తెలిపారు. మరోవైపు 100 పడకల ఆసుపత్రిలో నర్సింగ్‌ కళాశాల ఉంటుందని సీఎం రేవంత్‌ అన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ కల్పిస్తామన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మానవ వనరులను ప్రభుత్వం సమకూర్చుతుంది. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సీఎం రేవంత్ వివరించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవిని భర్తీ చేసి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్లకు కమిషనర్లను నియమించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అయితే అవసరమైన ఉద్యోగాలను తామే భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతిభావంతులైన విభాగాధిపతులను నియమించే బాధ్యత ఆయనదే. అధికారుల నియామకంలో సామాజిక న్యాయం కూడా ఉంటుంది. తనకు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి లేదని రేవంత్ స్పష్టం చేశారు.
RGV : న్యూయర్ పార్టీలో అమ్మాయితో రచ్చ చేసిన ఆర్జీవి.. ఆ అమ్మాయి ఎవరో తెలుసా?