Medigadda : మేడిగడ్డ పునరుద్ధరణపై సర్కారు నజర్.. 20న సీఎం రేవంత్‌తో కలిసి మంత్రి ఉత్తమ్ పర్యటన.!
- మేడిగడ్డపై సర్కారు ఫోకస్
- 20న సీఎం రేవంత్ పర్యటన
- సాయిల్ టెస్టింగ్‌కు ప్రాధాన్యం
- గత ప్రభుత్వంపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు , పునరుద్ధరణ పనులపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి తాను స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) చైర్మన్ అనిల్ జైన్‌తో భేటీ అయిన మంత్రి, ప్రాజెక్టు తాజా పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు.
Muslim Population: 4 నుంచి 160 వరకు.. ఆ దేశంలో భారీగా పెరిగిన మజీదులు.. పెద్ద ఎత్తున నిరసనలు..
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
గోదావరి నదికి వరదలు వచ్చేలోగానే మేడిగడ్డ వద్ద సాయిల్ టెస్టింగ్ (మట్టి పరీక్షలు) పూర్తి చేసి, అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా, మేడిగడ్డ డ్యామేజీకి సంబంధించి జరిగే సాయిల్ టెస్ట్ , డిజైన్ల ఖర్చును ప్రభుత్వం భరించబోదని, ఆయా కాంట్రాక్ట్ సంస్థలే భరించాల్సి ఉంటుందని మంత్రి తేల్చి చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. “బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. దాదాపు 97 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం ఏటా 10 వేల కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసినందున, దానిని ఎలాగైనా రిపేర్ చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రికి గానీ, తమ ప్రభుత్వానికి గానీ ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. కేవలం ప్రజల సొమ్ము వృథా కాకూడదనే ఉద్దేశంతోనే పునరుద్ధరణ పనులపై దృష్టి సారించామని చెప్పారు. సాంకేతిక నిపుణుల సలహాలు, ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా పారదర్శకంగా ముందుకు వెళ్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?