Quthbullapur Chaos: కుత్బుల్లాపూర్ నగర శివారులో కల్లుకు అలవాటు పడిన పలువురు మత్తు కల్లు దొరక్క పోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో 10 మందిని వారి బంధువులు సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ లో చేర్పించారు. అయితే, కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగి పలువురు మృత్యువాత పడ్డ ఘటనతో ఎక్సైజ్ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత కల్లు దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. కల్లులో కలిపే మత్తు పదార్థాలను కలపకుండా కఠిన చర్యలు చేపట్టారు.
Read Also: Odisha: విద్యార్థిని ఆత్మహత్యపై ఉవ్వెత్తిన నిరసన జ్వాలలు.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగం
అయితే, గత మూడు నాలుగు రోజులుగా మత్తు కల్లు అందుబాటులో లేకపోవడంతో శివారు ప్రాంతాల్లోని కార్మికులు, ఇతరులు తీవ్ర మానసిక ఆవేదనకు గురై, కొన్ని సందర్భాల్లో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇక, వారికి ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు.. ప్రస్తుతానికి వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అయితే, సమాచారం తెలుసుకున్న సూరారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు.