NTV Telugu Site icon

Etela Rajender: 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదు.. న్యాయం కోసం తప్పలేదు

Etala

Etala

ఉదయం ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదని ఈటల అన్నారు. కానీ ఈ రోజు న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలో 149 ఎకరాల్లో ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది.. 1985లో ఆనాడు వివిధ సంస్థలలో పనిచేసే చిన్న ఉద్యోగులు ఈ లాండ్ కొనుగోలు చేశారని అన్నారు. 2006లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి మోసం చేసేందుకు చూశారు.. కానీ కోర్ట్ కూడా రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ తప్పని డిస్మిస్ చేసిందని ఎంపీ ఈటల పేర్కొన్నారు. 2011లో మరోసారి కాజేసే ప్రయత్నం చేశారు.. కొంతమంది అధికారులతో కలిసి DPO సహకారంతో.. ధరణిని ఆసరాగా చేసుకుని మళ్ళీ లాండ్ కాజేసే యత్నం చేశారని ఈటల రాజేందర్ తెలిపారు. ప్లాట్ ఓనర్స్ ఇళ్లు కట్టుకుందామంటే అనుమతులు రావడం లేదు.. రియల్ ఎస్టేట్ సంస్థ దౌర్జన్యంగా ప్లాట్స్ యజమానులను వేధిస్తున్నారని పేర్కొన్నారు.

Read Also: Talasani Srinivas: రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించాం..

ఓ బాధితుడు తన ఇళ్ళు కట్టుకుంటుంటే కూల్చివేశారు.. అతను చూపిద్దామంటే అక్కడికి వెళ్ళానని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. అక్కడ కొంతమంది రౌడీలు అక్కడ మద్యం సేవిస్తూ.. హంగామా చేశారు.. తనను చూసి చులకనగా మాట్లాడాడు.. అందుకే ప్రజల పక్షాన వాడిపై చేయి చేసుకున్నానని అన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో.. వారి ప్రతినిధిగా వారికి న్యాయం చేసేందుకు తాను పోరాటం చేస్తానని చెప్పారు. వారిపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్‌కి సైతం జరిగిన విషయం వివరిస్తానని తెలిపారు. కోర్టులలో న్యాయం దక్కినా కూడా స్థానికంగా వీరికి న్యాయం జరగడం లేదని వాపోయారు. వారికి న్యాయం చేయాలని కోరుతున్నాను.. ప్రభుత్వం స్పందించాలి, వీరికి న్యాయం చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.

Read Also: Laila : విశ్వక్ “లైలా” నుంచి రెండో సాంగ్ వచ్చేస్తోంది

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలో పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఉదయం అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ చెంప చెల్లుమనిపించారు. పార్టీ కార్యకర్తలు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ పై దాడి చేశారు. ఏకశిలానగర్‌లో పేదలను ఇబ్బంది పెడుతున్న రియల్ఎస్టేట్ బ్రోకర్లపై ఎంపీ ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.