NTV Telugu Site icon

Harish Rao: మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది..

Harish Rao

Harish Rao

మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పాపన్నపేటలో నిర్వహించిన ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. పంటలు చేతికొచ్చినా రైతుబంధు రాలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడంటే అప్పుడు నీళ్లు ఇచ్చామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని వ్యవసాయం మీద దృష్టి పెట్టమంటే.. వలసల మీద దృష్టి పెట్టాడని విమర్శించారు. కాంట్రాక్టర్లకు నిధులు ఇచ్చి.. కమిషన్లు కొట్టి రైతులకు మాత్రం డబ్బులు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రుణమాఫీ చేయని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు హ‌రీష్ రావు . తమ నేతల ఇళ్లకు వెళ్లి ఎందుకు కలుస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ జనాన్ని నట్టేటా ముంచిందన్నారు.

Read Also: Delhi Liquor case: కవితకు మరో చుక్కెదురు..! విచారణ కోసం సీబీఐ పిటిషన్

మరోవైపు.. బీజేపీపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని దుబ్బాక ప్రజలు ఏమి చేయలేదని… పనికి రాడని ప్రజలు చిత్తుగా ఓడించారు. రఘునందన్ రావు ఉప ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. రాముని పేరు చెప్పి… ఓట్లు పొందాలని బీజేపీ చూస్తుంది తప్ప ప్రజలకు మాత్రం ఏమి చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కోడ్ పేరు చెప్పి తప్పించుకున్నారు.. బీజేపీ వాళ్లు ఈడీ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వైఖరి నచ్చినోల్లతో జోడీ…నచ్చని వాళ్ళతో ఈడీ అన్నట్లు ఉందని హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

Read Also: Mamata Banerjee: విషపూరిత పామును పెంచుకోవచ్చు.. కానీ బీజేపీని నమ్మలేం..