Raghunandan Rao: లోక్ సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు.. కుల గణన గురించి గొప్పగా చెప్పే రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం పదవి బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, మిగిలిన ఆరు మంత్రి పదవులు కూడా బీసీలకే ఇవ్వాలన్నారు. సగం జనాభా ఉన్న బీసీలకు రెండే మంత్రి పదవులు ఇచ్చి జబ్బలు చాచుకుంటున్నారని సెటైర్లు వేశాడు. తెలంగాణ మంత్రివర్గంలో మైనారిటీ ఎందుకు లేరో చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఉదహరించారు ఎంపీ రఘునందన్ రావు
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
Read Also: ప్రాణాంతక క్యాన్సర్ ఎన్ని రకాలో తెలుసా..?
ఇక, ప్రధాని మోడీ మాటలు నిజం చేస్తాడు.. రాహుల్ మాటలు మాత్రమే చెప్తాడు అని రాఘునందన్ రావు తెలిపారు. మోడీ క్యాబినెట్ లో 27 మంది ఓబీసీ, 8 మంది దళిత, 8 మంది మహిళా మంత్రులు, ఐదుగురు మైనారిటీ మంత్రులు ఉన్నారని తేల్చి చెప్పారు. అలాగే, తెలంగాణ రాష్ట్రానికి ఏమీ రాలేదంటూ పత్రికల్లో రావడం బాధాకరం.. ఒక్క ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకే రూ. 20 వేల కోట్లకు పైగా ఇచ్చింది మోడీ సర్కారు అని ఆయన వెల్లడించారు. రైతులకు, ఉపాధి హామీ లాంటి పథకాలకు బడ్జెట్ పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానిదే.. మధ్య తరగతి ప్రజల గోడు విన్నది కేవలం నరేంద్ర మోడీని అని మెదక్ ఎంపీ రాఘునందన్ రావు చెప్పుకొచ్చారు.