Mayor Vijayalakshmi: నేడు కాంగ్రెస్ లోకి గద్వాల్ విజయలక్ష్మి.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayor Vijayalakshmi: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దీపదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఆమెతో పాటు ఆమె తండ్రి కేశరావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే ఆమె మార్పుతో ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరినా ఆమె పదవికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేలు ఎన్నికైన పార్టీ నుంచి మరో పార్టీలోకి మారితే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది కానీ.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల ప్రకారం కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ల పాత్రలు మారినప్పటికీ వారి పదవులు కోల్పోయే అవకాశం లేదు.
Read also: Pawan Kalyan: పిఠాపురానికి పవన్ కల్యాణ్.. నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
మొత్తం పాలకమండలిలో మెజారిటీతో కూడిన అవిశ్వాస తీర్మానం ద్వారా మాత్రమే వారు తమ పదవులను కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, అధికారం చేపట్టిన నాలుగేళ్ల తర్వాత కూడా అలాంటి అవకాశం లేదు. అందుకే ఏ పార్టీలోకి మారినా దాదాపు మరో ఏడాది వరకు వారి పదవులకు నష్టం లేదు. ప్రస్తుత పాలకమండలిలో మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత 11 ఫిబ్రవరి 2021న బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 10, 2025 వరకు వారి పదవులకు ఎలాంటి ముప్పు లేదు. వారి పనితీరు బాగా లేకున్నా, మరేదైనా కారణాల వల్ల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే. కాగా.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో పార్టీల బలాబలాలు, అవిశ్వాస తీర్మానాలు అసలు విషయం కాదని అధికారులతో పాటు రాజకీయ నేతలు చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా వారి పదవీకాలం స్వల్పకాలమే ఉండేది. అప్పటికి పార్టీల బలాబలాలలో పెనుమార్పులు వచ్చే అవకాశాలున్నాయి.
Pawan Kalyan: పిఠాపురానికి పవన్ కల్యాణ్.. నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!