BiG Breaking: నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారితో సహా తొమ్మిదిమంది సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BiG Breaking: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సోమవారం ఉదయం 9.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాంపల్లి బజార్ ఘాట్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు సమాచారం. డీఆర్ఎఫ్ బృందాలు రంగాల్లో దిగాయి. 15 మందిని కాపాడినట్లు సమాచారం. తొమ్మిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కారు రిపేర్ చేస్తుండగా డీజిల్ డబ్బాలకు అంటుకున్న మంటలు. మొదటి గ్రౌంగ్ ఫ్లోర్ లో మొదలైన మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్ దిగువ భాగంలో కొన్నాళ్లుగా అపార్ట్ మెంట్ సెల్లార్ లో మెకానిక్ షెడ్ ఉంది. ఇది జీ ప్లస్‌కు చెందిన 4 అంతస్తుల భవనం. తెల్లవారుజామున మంటలు చెలరేగగా… కొన్ని సెకన్ల వ్యవధిలోనే పొగ నాలుగో అంతస్తు వరకు వ్యాపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ భవనంలో మొత్తం 60 మంది నివసిస్తున్నట్లు సమాచారం.
నాలుగో అంతస్తు వరకు పొగ వ్యాపించింది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆరు అగ్నిమాపక దళ వాహనాలు మంటలను అదుపు చేస్తున్నాయి. ఫ్యాక్టరీలోని నాలుగో అంతస్తుకు మంటలు వ్యాపించాయి. ఘటనా స్థలం బయట పార్క్ చేసిన ఆరు ద్విచక్ర వాహనాలు, కారు దగ్ధమయ్యాయి. అయితే మరోవైపు పోలీసులు చెబుతున్నది 16 మందిని కాపాడినట్లు సమాచారం. కారు రిపేర్ చేస్తుండగా డీజిల్ డబ్బాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ గోదాం పక్కనే ఉన్న భవనానికి కూడా మంటలు వ్యాపించాయి. క్షతగాత్రులను, మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ గోదాములో డీజీల్ లాంటివి స్టోర్ చేశారని ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో నాల్గొవ అంతస్తువరకు మంటలు వ్యాపించాచి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read
IND vs NED: ప్రపంచకప్‌లో 9 మంది బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి కాదు.. 31 ఏళ్ల ముందు..!
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?