IND vs NED: ప్రపంచకప్‌లో 9 మంది బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి కాదు.. 31 ఏళ్ల ముందు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Three times a team used 9 bowlers in ODI World Cup innings: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ తరఫున మొత్తం 9 మంది బౌలింగ్ చేయడం విశేషం. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మినహా జట్టులోని మిగతా అందరూ బౌలింగ్ చేశారు. ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆర్ జడేజా.. బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు. వన్డే ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో తొమ్మిది మంది బౌలింగ్ చేయడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.
వన్డే ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌లో తొమ్మిది మంది బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. గతంలో రెండుసార్లు తొమ్మిది మంది బౌలింగ్ చేశారు. 1987లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 మందితో బౌలింగ్ వేసింది. 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజీలాండ్ తరఫున 9 మంది బౌలింగ్ చేశారు. 31 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ తొమ్మిది మందితో బౌలింగ్ చేసింది.
Also Read
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
Also Read: Shreyas Iyer Century: ఆ లక్ష్యంతోనే బ్యాటింగ్ చేశా.. సెంచరీపై శ్రేయస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి.. 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 5 బంతులు వేసి 7 పరుగులు ఇచ్చి.. ఓ వికెట్ సాధించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ చెరో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి.. వికెట్ తీయలేకపోయారు. శ్రేయస్ అయ్యర్‌కు కూడా బంతిని ఇచ్చి ఉంటే బాగుండేదని ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. రాహుల్, శ్రేయస్ ఏం పాపం చేసారు.. వారిని ఓ ఓవర్ ఇవ్వాల్సిందని నెటిజన్స్ రోహిత్ శర్మను ట్రోల్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!