Site icon NTV Telugu

Maoists Letters: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోల లేఖల కలకలం.. ఎమ్మెల్యేలే టార్గెట్..!

Movo Latters

Movo Latters

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మావోల పేరుతో లేఖలు కనిపించాయి. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిల పేర్లు ప్రస్తావిస్తూ లేఖలు వైరల్ అవుతున్నాయి. మావోయిస్టు నేత భాస్కర్, సికాసా ప్రభాత్ పేరుతో ఈ లేఖలు కనిపించాయి. ఇక, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని.. ఎమ్మెల్యే అనుచరులు సహాయం కోసం వచ్చే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆ లేఖలో మావోలు పేర్కొన్నారు.

Read Also: Shruti Haasan : శృతిహాసన్ పాటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

ఇక, ఎమ్మెల్యే దివాకర్ రావు అనుచరుడు హాజీపూర్ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నాడని.. అలాగే, ఎమ్మెల్యే దివాకర్ రావు కుమారుడు విజిత్ రావు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలను తెప్పించి యువతను నాశనం చేస్తున్నారని, వారి ద్వారా భూమి కబ్జాలు చేస్తున్నారని ఆ లేఖలో ప్రస్తావించారు. అలాగే, ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల దీన స్థితి, దాని కోసం వచ్చే ప్రభుత్వ నిధుల దారి మళ్లింపులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అలాగే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలు మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.

Read Also: Kotta Manohar Reddy: మహేశ్వరంలో కొత్త మనోహర్ రెడ్డి ప్రచారం.. అడుగడుగున ప్రజల నీరాజనం

అలాగే, ఖానాపూర్, నిర్మల్, ముధోల్, మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం ఎమ్మెల్యేలే టార్గెట్ గా ఈ లేఖలు కలకలం రేపుతున్నాయి. అవి మావోలే విడుదల చేశారా.. లేఖ గిట్టని వారి పనా అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆరా తీస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోల పేరుతో ఉన్న లేఖలు వైరల్ గా మారాయి. ఎన్నికల ప్రచారంకు వచ్చే బీజేపీ నాయకులను తరమండి బీఆర్ఎస్ నేతలను నిలదీయండి అంటూ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.

Exit mobile version