Kotta Manohar Reddy: అలుపెరుగకుండ అవిశ్రాంతంగా కొనసాగుతున్న గడప గడప కార్యక్రమంలో భాగంగా ఆర్కేపురం డివిజన్ లో మహేశ్వరం నియోజక వర్గం బీఎస్పి, ఎమ్మెల్యే అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అడుగడుగున ప్రజల నీరాజనాల మధ్య కొనసాగుతుంది. గెలుపు దిశగా అడుగులు వేస్తున్న కొత్త మనోహర్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి 60 గజాల ఉచిత స్థలం తో పాటు, గెలిచిన వెంటనే మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కబ్జా చేసిన భూములను తిరిగి ప్రజలకు పంచేల కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Read also: Adikeshava OTT Release: ఆదికేశవ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్..ఎప్పుడూ స్ట్రీమింగ్?
ప్రచారానికి వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని మహేశ్వరం నియోజకవర్గం బీఎస్పి, ఎమ్మెల్యే అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డికి బ్రహమరథం పట్టారు. ఇసుక వేసిన రాలనంత జనంతో కొనసాగిన ప్రచారంలో కొత్త మనోహర్ రెడ్డి గెలుపు ఖాయమని ప్రజలు విశ్వసిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్భంగా మాట్లాడిన కొత్త మనోహర్ రెడ్డి ఏనుగు ధాటికి కార్, హస్తం, పువ్వు నలిగిపోయాయని.. ఎన్నికల ఫలితాలతో మహేశ్వరం చరిత్ర సృష్టించబోతుందని అన్నారు. ఆదమరిస్తే మళ్లీ మహేశ్వరంలో చీకటి రాజ్యమేలుతుందని.. అల జరగకుండా ఉండాలంటే ఏనుగుగుర్తుకు ఓటువేసి కొత్త మనోహర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
Yogi Adityanath: నేడు తెలంగాణలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన