Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ లో సిరిపెల్లి సుధాకర్ అతని భార్య సుమన మృతుదేహాలు నేడు చల్లగరిగకు చేరుకున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు ఉద్యమ ప్రస్థానం ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్, బస్తర్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో సుధాకర్ అతని భార్య అదిలాబాద్ జిల్లాకు చెందిన సుమన ఇద్దరు ఎన్కౌంటర్లో మృతి చెందారు. అదిలాబాదు జిల్లాకు చెందిన సుమన బంధువులు ఎవరు మృతి దేహాన్ని తీసుకునేందుకు రాకపోవడంతో సుధాకర్ మృతదేహంతో పాటు సుమన దేహాన్ని చిట్యాల మండలం చల్లగరిగా గ్రామానికి ప్రత్యేక వాహనంలో తరలించి అంతిమ యాత్రకు మధ్యాహ్నం ఏర్పాట్లు చేస్తున్నట్లు సుధాకర్ కుటుంబ సభ్యులు తెలిపారు.
Read also: Venu Yeldandi : బాహుబలి ఏమైనా తీస్తున్నావా అని అవమానించారు.. కానీ సినిమా రిలీజ్ అయ్యాక..?
ఈ నెల 16న బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్ అని పోలీసులు వెల్లడించారు. కాగా, శంకర్ రావుపై రూ.25 లక్షల రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్ ఘటనకు సంబంధించిన వివరాలను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు భారీ ప్లీనరీకి సిద్ధమవుతున్నట్లు పోలీసు అధికారులకు సమాచారం అందింది. సీపీఐ(మావోయిస్ట్) బస్తర్ డివిజన్ నాయకులు శంకర్, లలిత, రాజు తదితరులు హాజరవుతున్నట్లు సమాచారం.
Read also: Paarijatha Parvam Review: పారిజాత పర్వం మూవీ రివ్యూ..
దీంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్), జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), రాష్ట్ర పోలీసులు, ఇతర భద్రతా బలగాలు సంయుక్తంగా చోటేబెథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బీనగుండ-కోరగుట్ట అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో సాయుధ మావోయిస్టులు జవాన్లపై దాడి చేసి ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చాయి. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Sivakarthikeyan: ఓటు బుల్లెట్ కన్నా శక్తివంతమైనది: శివకార్తికేయన్