Site icon NTV Telugu

Maoists : 30 ఏళ్ల అజ్ఞాతానికి ముగింపు.. పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

Maoists

Maoists

Maoists : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఇద్దరు నేతలు పోలీసులకు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న కాగా, మరొకరు బస్తర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన చౌదరి అంకూభాయ్. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటూ అజ్ఞాత జీవితం గడిపారు. ముఖ్యంగా లచ్చన్న మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని పారుపల్లి గ్రామానికి చెందినవారు.

Chandrababu and Amit Shah: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రితో కీలక చర్చలు..

పార్టీ లోపలున్న అనేక విభేదాలు, ఆరోగ్య సమస్యలు, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఒడిదుడుకుల జీవితాన్ని కొనసాగించడం కష్టంగా మారటంతో ఈ నేతలు రహస్య అజెండాను విడిచి ప్రభుత్వానికి లొంగిపోయినట్లు తెలుస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. పోలీస్ శాఖ తరఫున లచ్చన్నకు రూ.20 లక్షలు, అంకూభాయ్‌కు రూ.5 లక్షలు నగదుగా బహుమతిగా అందజేశారు. వీరి లొంగింపు మావోయిస్టు ఉద్యమానికి మరో తీవ్రమైన దెబ్బగా భావిస్తున్నారు.

లొంగిపోయినవారికి ప్రభుత్వం పునరావాసం, భద్రతతో పాటు జీవనోపాధి కల్పనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వ విధానాల ప్రకారం ఈ దంపతుల పునర్వాస ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఈ లొంగింపు ఘటనతో మావోయిస్టు ఉద్యమ బలహీనపడుతున్న సంకేతాలే తెలుస్తున్నాయి. అటు పోలీసుల వ్యూహాత్మక చర్యలు, ఇటు ప్రభుత్వ పునరావాస పథకాలు ప్రభావితం చేస్తున్నట్లు నిపుణుల అభిప్రాయం.

Lowest total in Tests: టెస్టుల్లో అత్యల్ప స్కోర్ చేసిన చేసిన జట్లు ఇవే..!

Exit mobile version