Maoists : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఇద్దరు నేతలు పోలీసులకు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న కాగా, మరొకరు బస్తర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన చౌదరి అంకూభాయ్. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలంగా…