Manchireddy Kishan Reddy: రెండో రోజు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ ముందుకు హాజరయ్యారు. నిన్న మంచిరెడ్డిని 8 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఢించారని ఆరోపణలపై మంచిరెడ్డిని ఈడీ విచారన చేపట్టింది. తక్కువ సమయంలో రూ.88 కోట్ల లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. దీంతో మంచి రెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. మంచిరెడ్డి వాట్సప్ చాట్‌ను రిట్రీవ్ చేసారు అధికారులు. వాట్సప్ చాట్లో జరిగిన లావాదేవీలపై ఆరాతీస్తుంది ఈడీ.
కాగా, నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపై ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. నిన్న (మంగళవారం) మద్యాహ్నం సమయంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయనను రాత్రి 9 గంటల వరకూ అధికారులు అనేక అంశాలపై ప్రశ్నించారు. అయితే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ఆస్ట్రేలియా, సింగపూర్‌లకు నిదులు మళ్లించారన్న ఆరోపణలపైనే మంచిరెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈనేపథ్యంలో.. ఒకపక్క ఢిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ అధికారులు వరుసపెట్టి సోదాలు నిర్వహిస్తుండగా.. తాజాగా రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేని ఈడీ విచారించడం చర్చనీయాంశంగా మారింది.
ఓ కేసు విచారణ సందర్భంగా ఓ వ్యక్తిని ఈడీ అధికారులు విచారించగా, మంచిరెడ్డి లావాదేవీలకు సంబంధించిన పలు వివరాలు ఈడీకి తెలిశాయి. అతి తక్కువ సమయంలోనే మంచిరెడ్డి దాదాపుగా రూ.88 కోట్లకు పైగా లావాదేవీలు జరపారని, అది కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌ల్యాండ్ తదితర దేశాల్లో ఆయన ఈ లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ అధికారులు నిర్ధారించారు. అంతేకాకుండా.. ఈ దేశాల్లోని క్యాసినో, గోల్డ్ మైన్లలో మంచిరెడ్డి పెట్టుబడి పెట్టినట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
Cyber Fraud : కాకినాడ కలెక్టర్‌కు కేటుగాళ్లు షాక్..