NTV Telugu Site icon

Balka Suman: కాంగ్రెస్ పార్టీ వస్తే సామంతరాజుల పాలన వస్తుంది.

Balka Suman

Balka Suman

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పేరు కాస్త రేటెంత రెడ్డి అని పిలిచే కాడికి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ పై అహంకారంతో, బలుపెక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా.. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ రాజకీయాలను ప్రజలు నమ్మవద్దని బాల్క సుమన్ సూచించారు. కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ కొనుక్కుని వచ్చిన అన్నదములు వినోద్, వివేక్ అని దుయ్యబట్టారు. తనకు వందల కోట్లు ఉన్నట్లు సాక్ష్యాలతో చూపించ లేకపోతే ముక్కు భూమికి రాకుతావా అని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.

Read Also: Road Accident: పండగ పూట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి

టికెట్ అమ్ముకునే వ్యక్తికి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థి నాయకులకు కాంగ్రెస్ నుండి టికెట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ టికెట్లను అన్ని రేవంత్ అమ్ముకున్నారన్నారు. ఎలక్షన్ అప్పుడు సూట్ కేసులు పట్టుకుని వచ్చి గెలుస్తామంటున్నారని బాల్క సుమన్ దుయ్యబట్టారు. వివేక్ వాళ్ల నాన్న చనిపోతే కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోలేదని.. కేసీఆర్ ట్యాంక్ బ్యాండ్ మీద విగ్రహం పెట్టించి నివాళులు అర్పించారని తెలిపారు.

Read Also: Israel-Hamas War: గాజా ఆస్పత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయిల్ సైన్యం..

దేశ వ్యాప్తంగా అన్ని కంపెనీలు ఉన్న అన్నదమ్ములు పెద్దపల్లి పరిధిలో ఒక్క కంపెనీ కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కంపెనీ పెట్టి నిరుద్యోగులకు ఉపాధి ఎందుకు కల్పించలేక పోయారని అన్నారు. ఎలక్షన్ కమిషన్ కి అన్ని సాక్ష్యాలతో కంప్లైంట్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సామంతరాజుల పాలన వస్తుందని విమర్శించారు. కోట్లు ఖర్చు పెట్టి గెలిచేంత స్థోమత తమకు లేదని బాల్క సుమన్ పేర్కొన్నారు.

Show comments