DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
- ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు
- విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
- రాష్ట్రవ్యాప్తంగా 10,000 భారత్ జోడో క్లబ్‌లు ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అలాగే 13 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తానికి బుధవారం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇక ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ తొలి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత బస్ పాస్‌లు, భారత్ జోడో క్లబ్‌లు ప్రకటించారు.
యువత అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా భారత్ జోడో యువజన క్లబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు డీకే.శివకుమార్ ప్రకటించారు. ప్రతి క్లబ్‌కు ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందని చెప్పారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10,000 భారత్ జోడో క్లబ్‌లు ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడించారు.
Also Read
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్
ఇక విద్యార్థులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయాన్ని కూడా ప్రకటించారు. ఇప్పటివరకు బాలికలకు మాత్రమే ఉన్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయంపై విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని.. ఇకపై పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్‌లు అందించనున్నట్లు ప్రకటించారు. “అన్ని స్కూల్, కాలేజీ విద్యార్థులకు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచిత బస్ పాస్‌లు ఇస్తాం. ఇది డీకే శివకుమార్ మంత్రివర్గం తీసుకున్న తొలి నిర్ణయం” అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని.. రవాణా శాఖతో చర్చించి పూర్తి మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువకులు ప్రభుత్వ వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. వారి అర్హతలకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలతో చర్చించి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
యువత దృష్ట్యా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని డీకే శివకుమార్ చెప్పారు. “ఈ రాష్ట్ర ప్రజలు నాపై అపారమైన నమ్మకం ఉంచారు. గతంలో నన్ను విమర్శించి ఉండవచ్చు, ప్రశంసించి ఉండవచ్చు. రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు, సంతోషాలు చూశాను. చిన్న వయసులోనే అధికారాన్ని కూడా అనుభవించాను. ఇప్పుడు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నా లక్ష్యం” అని డీకే. శివకుమార్ పేర్కొన్నారు. ఇక డీకే శివకుమార్ తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ నియమితులయ్యారు.
Bengaluru: Addressing his first press conference as the CM of Karnataka, DK Shivakumar says, "You have been talking so much for the past one year, there were a lot of speculations. But today, the high command has put a full stop to it. I took oath at 4.05 pm today." pic.twitter.com/4gLzuwgRny
— ANI (@ANI) June 3, 2026
Bengaluru: Karnataka CM D.K. Shivakumar says, "We have taken some decisions from the perspective of the youth. The people of this state have placed immense trust in me. They may have criticised me in the past. They may have praised me. I have a background in political experience.… pic.twitter.com/iQ38HONa55
— ANI (@ANI) June 3, 2026
Bengaluru: Karnataka CM D.K. Shivakumar says, "This is the youth era. Students were asking why there is a free bus just for girls. We are giving passes to all students – free bus pass without any charge. Bus pass is free for all school and college students. This is the first… pic.twitter.com/GV3D77hFwd
— ANI (@ANI) June 3, 2026
Bengaluru: Karnataka CM D.K. Shivakumar says, "Unemployed people looking for jobs should register with the government. We will talk to companies and make arrangements to provide them with the jobs they need." pic.twitter.com/uN2kBzR9Rg
— ANI (@ANI) June 3, 2026
Bengaluru: Karnataka CM D.K. Shivakumar says, "It has been decided to form Bharat Jodo Youth Clubs in villages. The government will provide Rs 10 lakhs. This is being done so that youth clubs can be formed without resorting to other bad habits. The goal is to form 10,000 Bharat… pic.twitter.com/bPCQYwRqgg
— ANI (@ANI) June 3, 2026
BK Hariprasad appointed as the president of Karnataka Pradesh Congress Committee, succeeding DK Shivakumar. pic.twitter.com/fSVZl4F8OA
— ANI (@ANI) June 3, 2026
తాజావార్తలు
-
DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్‌లు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
-
Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
-
Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్‌గా..
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!