Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారికంగా ప్రకటించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను తొలగించి, అత్యంత శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఈ కొత్త ధరలను నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ప్రముఖ ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదికను, ఉన్నతాధికారుల సలహాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021-22లో ఎలాంటి క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండుసార్లు అశాస్త్రీయంగా ధరలను పెంచిందని, దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ రేటు కంటే ప్రభుత్వ విలువలు భారీగా పెరిగాయని మంత్రి విమర్శించారు. ఈ అసమానతలను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువల సవరణ చేపట్టారు.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ఈ కొత్త విలువల నిర్ణయంలో పారిశ్రామికాభివృద్ధి, కొత్త రహదారులు, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఇప్పటికే అధిక రేట్లు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపుదల చేయలేదు. అలాగే, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లలో అంతస్తుల వారీగా ఉన్న అసమానతలను తొలగించి అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేశారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలోని వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ప్రాథమిక రేట్లను కూడా ఖరారు చేశారు.
మరోవైపు.. గత ఐదేళ్లలో నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు పెరిగిన నేపథ్యంలో 2021 తర్వాత మొదటిసారిగా నిర్మాణ వ్యయాల రేట్లను కూడా సవరించారు. అనేక పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో ఆర్సీసీ, నాన్-ఆర్సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా మార్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భూ లావాదేవీలలో పారదర్శకతను పెంచుతూ, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!