ఫిబ్రవరి 14 వచ్చిదంటే చాలు.. పార్కుల వద్ద ప్రేమజంటలు కనిపిస్తుంటాయి. హైదరాబాద్‌లోని పార్కుల వద్ద ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రేయసి వెంట ప్రియుడు గులాబి చేతిలో పట్టుకొని ఐ లవ్ యూ అని ఫాల్ అవుతుంటే.. వెనకాలే.. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ప్రేమ జంటల వెనుక.. మేము పెళ్లి చేస్తామంటూ తిరుగుతుంటారు. దీంతో ఫిబ్రవరి 14 అంతా వివైధ్య సంఘటనలు పార్కుల వద్ద దర్శనిమిస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం ప్రేమజంటలకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రేమికుల రోజు సందర్భంగా నగరంలో ప్రధాన పార్కులను పోలీసులు మూసివేశారు. వాలెంటైన్ డే సందర్భంగా పార్కుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఇందిరా పార్కును గాంధీ నగర్ పోలీసులు మూసివేశారు. అంతేకాకుండా వాలెంటెన్స్ డే సందర్భంగా అయా పార్కుల వద్ద పోలీసుల పహారా కాస్తున్నారు.
అయితే ప్రేమజంటలు కనిపిస్తే వారికి వాలెంటైన్ డే జరుపుకోవద్దని దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమర వీరులను స్మరించుకోవడం వారికి నివాళులు అర్పించాలని కౌన్సిలింగ్ ఇస్తామని వీహెచ్పీ బజరంగ్‌దళ్ వెల్లడించింది. పోలీసులు పార్కు మూసివేయడంతో ప్రేమ జంటలు సందర్శకులు లేక ప్రధాన పార్కులు వెలవెలబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు ఈవెంట్స్ చేస్తే అడ్డుకుంటాం భజరంగ్ దళ్ వెల్లడించింది. పుల్వామాలో సైనికులు మృతిని స్మరించుకుంటూ ఎల్బీనగర్ లో జవానుల చిత్రపటాలకు భజరంగ్ దళ్ కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఫిబ్రవరి 14 విదేశీ సంస్కృతి అనుసరిస్తూ ఈరోజు ప్రేమికులు బయట తిరిగితే వారికి కౌన్సిలింగ్స్ ఇస్తామని, ఈవెంట్స్ పేరుతో సినిమా హాల్స్, బేకరిస్, హోటల్స్ లలో ప్రేమికుల రోజు పేరుతో ప్రోగ్రామ్స్ చేస్తే అడ్డుకుంటాం భజరంగ్ దళ్ తెలిపింది.