Site icon NTV Telugu

Ramachandru Nayak: పిచ్చెక్కి మాట్లాడుతుండు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఎమ్మెల్యే ఫైర్

Ramachandru Naik

Ramachandru Naik

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నాడు.. ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు పిచ్చి ప్రవీణ్ అని దుయ్యబట్టారు. ఆయనకు తలపై వెంట్రుకలే కాదు.. లోపల బ్రెయిన్ కూడా లేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నాడు.. అందుకే ఫార్ములా ఈ కార్ రేసులో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని అంటున్నాడని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ గడీలు, ఫామ్ హౌస్ బద్దలు కొడతామన్న ఆయన.. ఈ రోజు వాళ్ళు మీకు మంచి అయ్యారా..? అంటూ మండిపడ్డారు.

Read Also: DeepSeek: అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమేనా ? డీప్ సీక్ జవాబు ఇదే !

బీఎస్పీ పార్టీలో చేరి ఆ పార్టీ నిధులు ఏ విధంగా స్వాహా చేసిండో అందరికి తెలుసని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మిమ్మల్ని నమ్మిన దళిత, గిరిజన బహుజ బిడ్డలను మోసం చేశాడని తెలిపారు. కేసీఆర్ ఇచ్చే డబ్బుకు కక్కుర్తి పడి పార్లమెంట్ సీటు కోసం నమ్ముకున్న దళిత బహుజన బిడ్డలను నట్టేట ముంచారని ఆరోపించారు. పోలీసు అధికారిగా స్వెరోస్ స్థాపించి ఏ విధంగా గురుకులాలను బ్రష్టు పట్టించాడో తెలుసని ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పేర్కొన్నారు.

Read Also: Kissik Song: కిస్సిక్ సాంగ్ కి ఒక్కరోజే ప్రాక్టీస్.. వాళ్ళు ప్రొఫెషనల్స్ అబ్బా!

కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో ఎలాంటి అనుమతి లేకుండా విదేశాలకు తరలించారు.. సీఎం రేవంత్ రెడ్డి కారణంగానే ఫార్ములా ఈ కార్ రేసులో రాష్ట్రానికి నష్టం వచ్చిందని సిగ్గులేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. అహర్నిశలు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసం కష్టపడి పని చేస్తున్నారు.. ఇప్పటికైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రామచంద్రు నాయక్ సూచించారు. లేదంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని హెచ్చరించారు.

Exit mobile version