Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
- బయ్యారం మండలం కొత్తగూడెంలో భారీ అగ్నిప్రమాదం
- విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
- ట్రాక్టర్లతో మంటలను అడ్డుకున్న రైతులు
- నష్టపోయిన రైతులకు సహాయం చేయాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేతికి వచ్చిన పంట కళ్లముందే బూడిద కావడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఒక ఘోర అగ్నిప్రమాదంలో సుమారు 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన ఈ ప్రమాదం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పొలాల మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు రేగాయి. ఎండతీవ్రతకు తోడు గాలి ఉధృతి తోడవడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి సుమారు 2 కిలోమీటర్ల మేర వ్యాపించాయి. మంటలు వేగంగా గ్రామ సమీపానికి చేరుకోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మంటలు ఊరిపైకి వస్తుండటంతో రైతులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక యంత్రాలు వచ్చేలోపే, రైతులు తమ ట్రాక్టర్లతో పంట చేన్లను దున్ని మంటలు పక్కకు వ్యాపించకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. తమ కష్టాన్ని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడారు. అనంతరం సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట పూర్తిగా అగ్గిపాలవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!