Mahabubabad Mortuary Incident: బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటన.. ఏడాది తర్వాత మళ్లీ విచారణ
- మహబూబాబాద్ ఆసుపత్రికి చేరుకున్న హైపవర్ కమిటీ
- ఆధార్ లేదని వైద్యం నిరాకరించారన్న ఆరోపణలు
- కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ
- విచారణ నివేదిక ఆధారంగా వైద్యులపై చర్యలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా ఏడాది క్రితం సంభవించిన ఎల్దీ రాజు అనే వ్యక్తి మృతి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన అమానవీయ ఘటన , దానికి దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం మళ్లీ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఏర్పాటైన హైపవర్ ఎంక్వైరీ కమిటీ సభ్యులు మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.
ఆధార్ కార్డు లేదని వైద్యం నిరాకరించారా?
గత ఏడాది అక్టోబర్ 29న తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఎల్దీ రాజు అనే వ్యక్తిని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, అతడు బతికుండగానే మార్చురీలో ఉంచారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఆ తర్వాత చికిత్స పొందుతూ నవంబర్ 3న రాజు మృతి చెందాడు. గుర్తింపు కార్డు లేదా నివాస ధ్రువీకరణ పత్రం (ఆధార్) లేదనే సాకుతో వైద్యులు అతనికి తగిన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారని, అదే అతని మృతికి కారణమైందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, ఆ సమయంలో వచ్చిన విచారణ నివేదిక అరకొరగా ఉందన్న కారణంతో ఏడాది తర్వాత తాజాగా ఉన్నత స్థాయి కమిటీ రంగంలోకి దిగింది.
Also Read
- KTR: మా ప్రభుత్వం రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం..
- ACB Raids: పేదరికాన్ని నిర్మూలించే అధికారే కుబేరుడు.. 1.7 కిలోల గోల్డ్, 12 ప్లాట్లు, 2 ఫ్లాట్లు.. 2 లగ్జరీ కార్లు.. ఇంకా ఎన్నో..
- Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
- Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలాల సేకరణ
ఆసుపత్రికి చేరుకున్న హైపవర్ కమిటీ సభ్యులు.. ఘటన జరిగిన సమయంలో రాజుకు అందించిన వైద్య సేవలు, ఇన్-పేషెంట్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మృతుడు రాజు కుటుంబ సభ్యులైన అతని అన్నయ్య ముత్తయ్య, మేనబావ వెంకన్న, సోదరి ఆదిలక్ష్మిలను ఆసుపత్రికి పిలిపించి వారి నుంచి వివరాలు సేకరించారు. గుర్తింపు కార్డుల పేరుతో వైద్యం నిరాకరించడం నిజమేనా? మార్చురీలో ఉంచడానికి గల కారణాలేంటి? వైద్యుల అలసత్వమే మరణానికి దారితీసిందా? అనే కోణాల్లో కమిటీ లోతుగా విచారించింది.
వైద్యుల్లో తీవ్ర ఉత్కంఠ.. శిక్షపడితేనే శాంతి
ఈ విచారణ నివేదికను హైపవర్ కమిటీ పూర్తి వివరాలతో సీల్డ్ కవర్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)కి అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై ఎలాంటి చర్యలు ఉంటాయనే దానిపై మహబూబాబాద్ ఆసుపత్రి వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ తమ్ముడి మృతికి కారణమైన బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటేనే అతని ఆత్మకు శాంతి కలుగుతుందని రాజు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mahabubabad Mortuary Incident: బతికుండగానే మార్చురీలో పెట్టిన ఘటన.. ఏడాది తర్వాత మళ్లీ విచారణ
-
Jayasudha: ‘మీరు – నేను కలిసి నటిద్దాం.. టైటిల్ రోమన్ హాలిడే!’.. అల్లు అరవింద్‌కు జయసుధ క్రేజీ ప్రపోజల్
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!