టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో బీజేపీ తలపెట్టిన ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’కు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది. మహాధర్నాకు పోలీస్ లు అనుమతి ఇవ్వక పోవడంతో బీజేపీ కోర్ట్ నుండి అనుమతి తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించేందుకు అనుమతి లభించింది.