Site icon NTV Telugu

Madhu Yashki: బీజేపీ-టీఆర్‌ఎస్‌ కలిసి డ్రామాలు..

Madhu Yashki Goud

Madhu Yashki Goud

వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు ఆందోళన పర్వానికి తెరలేపారు.. అయితే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ-టీఆర్ఎస్‌ కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ.. వెంటనే ఐకేపీ కేంద్రాలు తెరవాలని డిమాండ్‌ చేసిన ఆయన.. కేంద్రం కొంటుందా.. రాష్ట్రం కొంటుండా అని కాదు.. ఏపీ, కర్ణాటకలో కొనుగోలు పంచాయతీ లేదు.. కానీ, తెలంగాణలో మాత్రం డ్రామాలు నడుస్తున్నాయని విమర్శించారు.. ఈ నెల 11వ తేదీ లోపు కొనుగోలు కేంద్రాలు తెరవాలని డెడ్‌లైన్‌ పెట్టిన యాష్కీ.. అధికార పార్టీలు సమస్య పరిష్కారం చేయాలి.. ఆందోళనలు కాదు అని హితవుపలికారు.

12వ తేదీన నియోజక వర్గ కేంద్రాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నాలు చేయనున్నట్టు ప్రకటించారు మధుయాష్కీ గౌడ్.. గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరుతున్నాం.. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కు అవుతుంది అని ఫిర్యాదు చేస్తామని.. సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తామన్నారు.. ఇక, ఏప్రిల్ 15 తర్వాత ఐదు బృందాలుగా ఏర్పడి కొనుగోలు కేంద్రాలు పరిశీలించనున్నట్టు వెల్లడించిన ఆయన.. తక్కువ ధరకు ధాన్యం కొంటున్న మిల్లర్ల పై విజిలెన్స్ దాడులు.. కేసులు పెట్టాలి డిమాండ్ చేస్తామన్నారు.. ఏప్రిల్ 14న సంజయ్ పాదయాత్రకు హేమంత్ బిస్వల్ వస్తున్నారు.. ఆయన మీద కేసు ఉంది… ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేస్తున్నారు.. కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు.. దీనిపై డీజీపీని కలుస్తామన్నారు మధుయాష్కీ.

Exit mobile version