NTV Telugu Site icon

Loan Apps Harassments: లోన్ యాప్‌ల వేధింపులు.. యువతి బలవన్మరణం

Loan App 1

Loan App 1

ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పు చేయాలి. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడం, ఆ తర్వాత వాటిని చెల్లించడం చేసేవారు. అయితే, బ్యాంకుల్లో అప్పులకు వడ్డీలు తక్కువ. ఆలస్యం అయితే జరిమానాలు చెల్లించాలి. అంతేగానీ వేధింపులు వుండవు. కానీ ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు.

లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో ఈ వ్యాపారాన్ని వదులుకోవడంలేదు. లోన్ యాప్ బాధితులు ఎవరూ అధైర్య పడి,ఆత్మహత్యలు చేసుకోవద్ధు. తగిన ఆధారాలతో సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తే ..ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నా.. యువత మాత్రం బలవన్మరణాలకు పాల్పడుతూనే వున్నారు. అప్పుల విషయంలో జాగ్రత్తగా వుండాలని, గుర్తింపు పొందిన సంస్థలలో మాత్రమే అప్పులు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. గతంలో లోన్ యాప్ ల బారిన పడి అధిక వడ్డీలు కట్టలేక, బ్లాక్ మెయిలింగ్ తట్టుకోలేక అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

తాజాగా మంచిర్యాలలో లోన్ యాప్ ల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గోపాల్ వాడ కు చెందిన బొల్లు కళ్యాణి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. Small loan app,Basic loan app, Money loan app, Lending channel app, Loan product app, Shine Loan app, Hollow rupee app అనే లోన్ యాప్ లలో లోన్లు తీసుకొని సరైన టైమ్ లో చెల్లించక పోయేసరికి ఆమె ఫోన్‌ నుంచి యాక్సెస్‌ చేసుకున్న కాంటాక్ట్‌ నంబర్లు, వాట్సప్‌ గ్రూపుల ద్వారా ఆమెను బహిరంగంగా అవమానించటం మొదలుపెట్టారు. తీసుకున్న లోన్‌ కి భారీగానే వడ్డీలు చెల్లించింది. అయినా అప్పు తీరలేదు. బంధువులకు ఫోన్లు చేసి వేధించడంతో వారి వ్యవహారశైలితో మనస్తాపం చెంది కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడింది. లోన్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇబ్బందులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయాలని మంచిర్యాల జోన్ ఇన్‌ ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ సూచించారు.

NayanThara: ప్రియుడు కోసం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నే క్యాన్సిల్ చేసిందా..?